• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఖైదీ సినిమాతో బయ్యర్లు నష్టపోనున్నారా..????

  khaidi

  మెగా స్టార్ చిరంజీవి దాదాపు దశాబ్దం తరువాత మల్లి రీఎంట్రీ ఇచ్చి “ఖైదీ నెం150” సినిమాలో నటించాడన్న విషయం మనకి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ అయ్యిపోగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందింది.

  ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ నుండి నిన్న రిలీజ్ అయ్యిన రైతు సాంగ్ వరకు ప్రతీ ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉన్నాయి.మెగా ఫాన్స్ తో పాటు సినీ వర్గాలు కూడా సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో చిరు చాలా స్టైలిష్ గా ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించటమే ఇన్ని అంచనాలకు కారణం అని తెలుస్తుంది.ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతే రేంజ్ లో జరుగుతుంది.మొత్తం మీద 90 కోట్లు వరకు బిజినెస్ జరిగిందని సమాచారం.బయ్యర్లు లాభం పొందాలి అంటే ఎంత కాదన్న 100 కోట్లు వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్ట్ చెయ్యాలి అప్పుడే బయ్యర్లు నష్టపడకుండా ఉంటారు.

  ఇంత మొత్తం రాబట్టాలి అంటే సినిమా రిలీజ్ నుండి మూడు వారాలు వరకు ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో నడిస్తేనే గాని ఇంత మొత్తం రాబట్టగలడు చిరు, కానీ ఒక్క రోజు గ్యాప్ తోనే బాలయ్య బాబు “గౌతమీ పుత్ర శాతకర్ణి” సినిమాతో వచ్చేస్తున్నాడు,ఇది కూడా బడా సినిమానే కాబట్టి రెండో రోజు నుండే ఖైదీ సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ ఉండొచ్చు, అలాగే 14న శర్వానంద్ సినిమా కూడా పోటీ కి దిగిపోతుండటంతో బయ్యర్లు లాభపడతారా… లేదా.. అన్నది తెలియట్లేదు.

  ఈ సినిమాలే కాకుండా 26న వెంకటేష్ గురు అలాగే తమిళ స్టార్ హీరో సూర్య నటించిన “సింగం3” కూడా బరి లోకి దిగిపోతున్నాయి.మరి వీటి అన్నిటిని తట్టుకొని చిరు సినిమా నిలబడగలదా లేదా బయ్యర్లకి నష్టాలు తప్పవా అనేది తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయిన మొదటి వారం వరకు వేచి చూడాల్సిందే..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *