• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  “ఖైదీ నెం150 ” టీజర్ కి డేట్ ఫిక్స్!!!

  khaidi

  మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు మొదలైందో అప్పటి నుండే ఈ సినిమా మీద అభిమానులకు అంచనాలు తార స్థాయికి చేరిపోయాయి.ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారన్న విషయం మనకి తెలిసిందే.చిరు హీరో గా నటించే 150వ చిత్రం అలాగే 10 సంవత్సరాళ్ల తరువాత కంప్లీట్ హీరో గా వస్తున్న సినిమా కాబట్టి అందరి చూపులు ఖైదీ పైనే ఉన్నాయి.

  అయితే ఇప్పటి దాకా ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఫొటోస్ మాత్రమే బయటకి వచ్చాయి గాని టీజర్ ఇప్పటి దాకా విడుదల చెయ్యలేదు . ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ కి కూడా డేట్ వచ్చేసింది.డిసెంబర్ 8వ తారీఖున ఈ టీజర్ ని విడుదల చేయనున్నారు.నిన్న జరిగిన “ధృవ” ప్రీ రిలీజ్ వేడుకలో ఈ విషయాన్నీ కన్ఫార్మ్ చేసాడు “ఖైదీ నెం150” నిర్మాత రామ్ చరణ్. అలాగే టీజర్ లోని ఒక ఫైట్ సీన్ ఫోటో ని కూడా నిన్న విడుదల చేయటం తో ఇప్పుడు అదే పిక్ టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది.ఎక్కడ చుసిన ఇదే పిక్ సోషల్ మీడియా మొత్తం చెక్కర్లు కొట్టేస్తుంది.మెగా స్టార్ అంటే ఆ మాత్రం ఉండకపోతే ఎలా చెప్పండి.

  “ఖైదీ నెం150” లో హీరోగా మెగా స్టార్ చిరంజీవి నటించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. వి.వి.వినాయక్ దర్సకత్వం వహించిగా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ లో ఈ సినిమాని నిర్మించాడు.మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ పనిచేసాడు.డిసెంబర్ మూడో వారం లో “ఖైదీ నెం150” ఆడియో విడుదల వేడుకను నిర్వహించాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉందని సమాచారం దీని మీద ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకి సిద్ధంగా ఉంది “ఖైదీ నెం150”.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *