• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మహేష్ హీరోయిన్ గా శైలజ…

  mahesh-babu-keerti-suresh

  మహేష్ బాబు.. ఈ పేరు వింటేనే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గుర్తొస్తాయి మన అందరికి, శ్రీమంతుడు సినిమాతో దాదాపుగా నాన్-బాహుబలి రికార్డ్స్ ని తన ఖాతలో వేసుకున్న ప్రిన్స్. ఇప్పడు మరోమారు తనకి శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే తాజాగా రామానాయుడు స్టూడియోలో పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం కొరటాల మరో పవర్ ఫుల్ సోషల్ ఎలిమెంట్స్ కథని రెడీ చేసుకున్నాడని తెలుస్తుంది.

  ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని వేట మొదలుపెట్టిన కొరటాల శివ ‘నేను శైలజ’ ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫైనల్ చేశాడని తెలుస్తుంది. కీర్తి తాజాగా నటించిన “రెమో” సినిమాలో ఆమె నటనకి ఇంప్రెస్స్ అయిన కొరటాల ఈ ఆఫర్ ఇచ్చాడని తెలుస్తుంది, మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ అనగానే ఎగిరి గంతేసి మరి కీర్తి సురేష్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ అంటే ఇంతకు మించి మంచి ఆఫర్ ఏమి ఉంటుంది చెప్పండి. ప్రస్తుతం తెలుగులో ఈమె నేను లోకల్ అనే సినిమాలో నటిస్తుంది.

  ప్రస్తుతం మహేష్ బాబు, మురగదాస్ దర్శకత్వంలో ఇంకా పేరు ఖరారు చేయని సినిమాలో నటిస్తున్నాడు, తాజా షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 23 వరకు జరుగుతుంది, ఆ తర్వాత అహ్మదాబాద్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు, జనవరి మొదటి వారంలోపు ఈ సినిమా పూర్తి చేసి, అదే నెల చివరి నాటికీ కొరటాల సినిమాని సెట్స్ మీదకి తీసుకు పోవాలని మహేష్ ప్లాన్ లో ఉన్నాడు.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *