• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి…

  kcr-presented-rs-3-7-crore-golden-crown-to-warangal-bhadrakhali-ammavaaru-2

  తెలంగాణలో బతుకమ్మ పండగ సందర్బంగా వరంగల్ లోని భద్రకాళి ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక పూజల నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ వస్తే అమ్మవారికి కిరీటం సమర్పిస్తానని మొక్కుకున్న కెసిఆర్ ఆ మొక్కును ఈ పండుగ రోజు తీర్చుకున్నారు ఈ సందర్బంగా భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం బహుకరించారు కెసిఆర్. రూ.3.70 కోట్లతో తాయారు చేయించిన ఈ కిరీటం 11.7 కిలోల బరువు ఉన్నది.

  అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కెసిఆర్ వరంగల్ అభివృద్ధికి త్వరలో మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాం ఇప్పటికే 300 కోట్లు కేటాయించాం హెరిటేజ్ సిటీతో కేంద్రం నుంచి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది భద్రకాళి ఆలయంతో పాటు పద్మాక్షమ్మ గుట్టను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

  కొత్త జిల్లాలపై ఏడాది పాటు కసరత్తు చేశామని అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు జిల్లాలు ఎందుకు గుర్తుకురాలేదని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని మండిపడ్డారు కెసిఆర్. కొత్త జిల్లాలపై కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం లేదని శాస్త్రీయత అంటే ఏంటో కాంగ్రెస్ నేతలు చెప్పాలని ఎద్దేవా చేశారు. ప్రజలకు మేలు చేసేందుకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కేంద్రాలనే కాదు పట్టణాలను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే సిపిఎం నేతలు పాదయాత్ర చేయాలనీ చివరివరకు తెలంగాణను అడ్డుకొని ఇప్పుడు పాదయాత్రలా..? అని కెసిఆర్ మండిపడ్డారు…

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *