• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  శాతకర్ణి’ ప్రత్యేక ప్రదర్శనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌

  kcr

  నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా యొక్క ప్రత్యేక ప్రదర్శనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకానున్నారు.ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ప్రకటించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ శుక్రవారం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రీమియర్‌ షోకు రావాల్సిందిగా ఆహ్వానించగా..కేసీఆర్‌ అంగీకరించారని బాలకృష్ణ తెలిపారు.

  ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంపై కేసీఆర్‌ ముందు నుంచీ ఆసక్తి కనబరుస్తున్నారు. బాలకృష్ణ ఆహ్వానం మేరకు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభోత్సవానికి హాజరై కొబ్బరికాయ కొట్టారు. తెలుగుజాతి గర్వించదగ్గ శాతకర్ణి కథను తెరకెక్కించడం గర్వకారణమంటూ బాలకృష్ణను అభినందించారు. దీంతో పాటు ఈ సినిమాను తొలుత తనకే చూపించాలని కేసీఆర్‌ కోరారు. ఈ నేపథ్యంలోనే సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ.. కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ప్రత్యేక ప్రదర్శనకు ఆహ్వానించారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *