• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  విషాదం అలుముకున్న కన్నడ క్లైమాక్స్

  uday,anil kannda film satrs

  సినిమా చిత్రీకరణలో సరైన జాగ్రతలు పాటించకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో మరో మారు రుజువయ్యింది, తాజాగా కన్నడ చలన చిత్ర పరిశ్రమకి సంభందించిన ఒక సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సంధర్బంగా చోటు చేసుకున్న సంఘటనలో ఉదయ్,అనిల్ అనే ఇద్దరు వర్ధమాన నటులు దుర్మరణం చెందారు.

  కన్నడ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న’మాస్తిగుడి’ అనే సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను బెంగుళురు నగర శివార్లలోని తిప్పాగొండన హళ్ళి సమీపంలో గల ఒక చెరువులో షూటింగ్ చేస్తూ హెలికాప్టర్ పై నుండి నీటిలో దూకే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు, ఇందులో భాగంగా విలన్లు అయిన ఉదయ్, అనిల్ మొదట నీటిలోకి దూకారు ఆ తరవాత హీరో అయిన విజయ్ దూకారు, అయితే వీళ్ళు నీటిలోకి దూకిన వెంటనే కాపాడాల్సిన మరపడవ చెడిపోవటంతో ఈత వచ్చిన హీరో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు, అయితే ఈత అంతంత మాత్రమే వచ్చిన ఉదయ్, అనిల్ కాసేపు నీళ్ల మీద చేతులు ఆడిస్తూ రక్షణ కోసం వేడుకుంటూ ఎలాంటి సహాయం అందకపోవటంతో అందరూ చూస్తుండగానే నీటి మునిగిపోయారు.

  వీళ్ళు చనిపోవడానికి చిత్ర యూనిట్ ప్రధాన కారణం అని తెలిసింది,ఉదయ్, అనిల్ షూటింగ్ కి ముందే మాకు భయంగా వుంది ఈత సరిగ్గా రాదని చెప్పిన ఆ సినిమా ఫైట్ మాస్టర్ రవి వర్మ ఎలాంటి ముందు జాగ్రత్తలు అనేవి తీసుకోకుండా వ్యవరించటం వలనే ఈ సంఘటన జరిగినదని తెలుస్తుంది.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *