• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  కమల్-గౌతమి విడిపోవడానికి గల కారణాలు..

  kamal-hassan-gautami

  గత పదమూడేళ్ళగా సహజీవనం చేస్తున్నకమల్ హాసన్-గౌతమి తమ వున్నా రిలేషన్ షిప్ కి ముగింపు పలికారు, గత కొద్దీ రోజులుగా ఈ విషయంపై మల్లగుల్లాలు పడుతున్న వారు తాజాగా ఒక చంచలన నిర్ణయంతో 13 ఏళ్ల బంధానికి స్వస్తి  చెప్పారు. ఇదే విషయాన్ని గౌతమి సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను విడుదల చేసింది.

  ‘ఈ రోజు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం చాలా బాధగా ఉంది, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోకతప్పదని, మా ఇన్నేళ్ల జీవితంలో ఇలాంటి అరమరికలు లేకుండా జీవించమని, ఇద్దరి ఆలోచలు ఒకేలా ఉన్నంత వరకు ఇలాంటి సమస్యలు రావని ఆలోచనలు కలవనప్పుడు కలిసి ఉండటం చాలా కష్టం, ఇప్పుడు నేను అదే పరిస్థితిలో ఉన్నాను , కమల్ అంటే నాకు అభిమానము ఎప్పటికి ఉంటుందని ఒక నటుడిగా ఆయనంటే ఎంతో గౌరవమని,ఇంకా కమల్ వెండి తెర ఎన్నో అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను, ఆయన సినిమాలో నేను పని చేసినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను, ఇక మీదట అయన సాధించే విజయాలను అభినందించటానికి నేనే ముందుటానని’ చెప్పకొచ్చింది.

  ఇన్ని సంవత్సరాలు కలిసి ఉంది ఇలా సడన్ గా విడిపోవడానికి గల కారణాలు లేకపోలేదు అని గౌతమి సన్నిహితులు చెపుతున్నారు, కమల్-గౌతమి మధ్య అంతర్గత సంఘర్షణలు చోటు చేసుకున్నాయని, అలాగే కమల్ కూతుర్లకి గౌతమికి మధ్య కొన్ని విషయాల్లో విబేధాలు రావటం కూడా ఈ పరిణామానికి దారి తీశాయని చెపుతున్నారు, గతంలో శృతిహాసన్ కి గౌతమికి శబాష్ నాయుడు షూటింగ్ సంధర్బంగా జరిగిన గొడవను మనం మర్చిపోకూడదు…

    గౌతమి లేఖను ఈ క్రింది లింక్ లో చదవండి

  Life and decisions

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *