• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  జ్యో అచ్యుతానంద.. ఆరంభం అదిరింది

  jyo-achyuthananda-movie-movie-usa-premier-collections-1473500717-182

  మంచి సినిమాలకు మంచి వసూళ్లు వస్తాయని గ్యారెంటీ ఏమీ లేదు. గత నెలలో ‘మనమంతా’ సినిమా అలాగే దెబ్బ తింది. ఐతే ఆ సినిమా తీసిన సాయి కొర్రపాటే.. తాజాగా ‘జ్యో అచ్యుతానంద’ నిర్మించాడు. ఈ సినిమాకు తొలి రోజు చాలా మంచి టాక్ వచ్చింది. ప్రశంసలు లభించాయి. దానికి తగ్గట్లే వసూళ్లు కూడా వస్తుండటం మంచి పరిణామం. అమెరికాలో ఈ సినిమాకు ప్రిమియర్ షోలు భారీగానే ప్లాన్ చేశారు. రెస్పాన్స్ బాగుంది. మంచి కలెక్షన్లు వచ్చాయి.

  ప్రిమియర్లతో కలుపుకుని తొలి రోజు ఈ సినిమా దాదాపు 50 వేల డాలర్లు వసూలు చేయడం విశేషం. ‘జ్యో అచ్యుతానంద’ లాంటి చిన్న సినిమాకు తొలి రోజు ఇంత వసూళ్లు రావడం అంటే గొప్ప విషయమే. తొలి రోజు టాక్.. వసూళ్లు బాగుంటే ఆ తర్వాత పికప్ మరింత బాగుంటుంది. వీకెండ్ కాబట్టి శని.. ఆదివారాల్లో వసూళ్లు మరింత బాగుంటాయని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎ సెంటర్లలో ఈ సినిమాకు రెస్పాన్స్ బాగుంది. తొలి
  రోజు హౌస్ ఫుల్స్ పడ్డాయి. బి.. సి సెంటర్లలో పెద్దగా ఆడకపోయినా.. మల్టీప్లెక్సుల్లో మంచి వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికాలో ఈ చిత్రాన్ని వారాహి వాళ్లే సొంతంగా రిలీజ్ చేశారు. అక్కడ అంచనాలకు మించి
  సినిమా విజయం సాధించేలా కనిపిస్తోంది. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత వారాహి వాళ్ల ఖాతాలో ఓ కమర్షియల్ సక్సెస్ పడేలా కనిపిస్తోంది.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *