• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మూవీ రివ్యూ : జయమ్ము నిశ్చయమ్మురా

   

  jayammu nischayammu ra review

  చిత్రం పేరు :జయమ్ము నిశ్చయమ్మురా

  నటి నటులు:శ్రీనివాస్ రెడ్డి ,పూర్ణ, పోసాని కృష్ణ మురళీ,కృష్ణ భగవాన్,ప్రవీణ్,రవి వర్మ,తాగుబోతు రమేష్ మొదలైనవారు.

  సంగీతం:రవి చంద్ర

  ఛాయాగ్రహణం : నగేష్

  ఎడిటింగ్:వెంకట్

  నిర్మాత:శివ రాజు కనుమూరి,సతీష్ కనుమూరి

  ప్రొడక్షన్ హౌస్ : శివ రాజు కనుమూరి

  రచన,దర్శకత్వం : శివ రాజు కనుమూరి

  ఒక కమెడియన్ హీరోగా మారి సినిమా చేయటం తెలుగులో కొత్తేమి కాదు, అలీ,సునీల్ లాంటి ఎంతో మంది హీరోలుగా సినిమాలు చేశారు, అదే జాబితాలోకి చేరిపోయాడు శ్రీనివాస్ రెడ్డి. గీతాంజలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే సినిమాతో వచ్చాడు, ఒక కమెడియన్ సినిమాకి ఇంత భారీ స్థాయిలో పబ్లిసిటీ ఈ మధ్య కాలంలో రాలేదనే చెప్పాలి, అనేక అంచనాలు మధ్య ఈ రోజే విడుదల అయినా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమా జయం సాదించిందో లేదో చూద్దాం..

  మూల కథ : సర్వ మంగళం(శ్రీనివాస్ రెడ్డి) ఒక పల్లెటూరి కుర్రాడు, విపరీతమైన జాతకాల పిచ్చి, ఎవరు ఏమి చెప్పిన పాటించే మనస్తత్వం, ప్రభుత్వ ఉద్యోగం సాధించి కాకినాడ మున్సిపల్ ఆఫీస్ లో జాయిన్ అవుతాడు,తన తల్లి కోసం కరీంనగర్ ట్రాన్స్ఫర్ అవ్వాలని ట్రై చేస్తున్న సమయంలో రాణి (పూర్ణ) పరిచయం అవుతుంది తనని ప్రేమిస్తాడు సర్వ మంగళం, అయితే రాణి మరో వ్యక్తికి దగ్గరవుతుంది, అతను మంచి వ్యక్తి కాదని సర్వ మంగళానికి తెలుసు, అతని బారినుండి రాణిని ఎలా కాపాడాడు,..? సర్వమంగళం తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు…? తన తల్లీ కోరిక ప్రకారం కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయ్యాడా లేడా..అనేది మిగిలిన కథ..

  విశ్లేషణ: ఈ సినిమాలో మొదట చెప్పుకోవలసింది హీరో పాత్ర గురించి ఒక ఆత్మ విశ్వాసం లోపించిన  పిరికివాడు పాత్రని ఈ కథకి హీరోగా తీసుకోవటంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న కధనాలు వాటిని నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది,హీరో ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక్కో క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తూ పండించే హాస్యం చాలా బాగుంటుంది,ముఖ్యంగా పంతులి పాత్రలో పోసాని కృష్ణ మురళీ, అడపా ప్రసాద్ గా కృష్ణ భగవాన్ నటన వాళ్ళ పాత్రలు ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతాయి,అయితే ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసినట్లు అనిపించటంతో కొంచం బోర్ అనే ఫీలింగ్ కలుగుతుంది,అయితే ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలతో సినిమా మీద మళ్ళీ ఆసక్తి కలిగిస్తాయి.

  సెకండాఫ్ లో హీరో తన అమాయకత్వంని పిరికితనాన్ని వదిలేసి తనతో ఆడుకున్న అందరి మీద ప్రతీకారం తీర్చుకునే దగ్గరనుండి సినిమా వేగం పుంజుకుంటుంది,మొదటి భాగంలో ఒక అమాయక చక్రవర్తిగా నటించిన శ్రీనివాస్ రెడ్డి సెకండాఫ్ లో తనలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసి బాగానే నవ్విస్తాడు,అలాగే అమాయక పాత్రనుండి ఆత్మ విశ్వాసం కలిగిన హీరోగా మారిపోయే సన్నివేశం కూడా బాగా బలంగానే ఉంటుంది, అయితే మధ్య మధ్యలో హీరో మీద అవసరం లేని సన్నివేశాలు అతికించినట్లు అనిపిస్తుంది కానీ చివరికి మంచి ముగింపుతో సినిమాని పూర్తి చేసి ఆకట్టుకున్నారు.

  నటి నటులు: ఈ సినిమాకి శ్రీనివాస్ రెడ్డి నటన ప్రధాన హైలెట్ అని చెప్పాలి, మొదటిభాగంలో తన అమాయకత్వంతో జాతకాల పిచ్చితో అందరి చేతుల్లో మోసపోవటం లాంటి పాత్రలో బాగానే నటించాడు, అతనికి పూర్తి ఆత్మ విశ్వాసం కలిగిన వ్యక్తిగా మారిపోయే సన్నివేశంలో శ్రీనివాస్ రెడ్డి నటన మెచ్చుకోదగిన స్థాయిలోనే వుంది, అలాగే సెకండాఫ్ లో తనలో హాస్య నటుడిని బయటకు తీసి మెప్పించాడు, హీరో అంటే ఓ నాలుగు ఫైట్స్, ఆరు పాటలు ఉండాలనే నియమాలు ఏమి పెట్టుకోకుండా కథకి తగ్గట్లు నటించాడు,హీరోయిన్ పూర్ణ కూడా స్వయం కృషితో బ్రతకాలనే అమ్మాయి పాత్రలో బాగానే నటిచింది,సంప్రదాయమైన దుస్తుల్లో కనిపిస్తూ తన పాత్ర మేర బాగానే మెప్పిచింది,అలాగే పోసాని క్లైమాక్స్ నటన ఈ సినిమాకే ప్లస్ అవుతుంది,చాలా కాలం తర్వాత సినిమాల్లో కనిపిస్తున్న కృష్ణ భగవాన్ పాత్ర థియేటర్ నుండి బయటకు వచ్చినా.. ప్రేక్షకులకి గుర్తువుండిపోతుంది, అలాగే ప్రవీణ్,రవి వర్మ మిగిలిన వాళ్ళు మంచి పాత్రలే పోషించారు.

  సాంకేతిక వర్గం: ఇలాంటి కథని ఎంచుకున్నందుకు ముందుగా దర్శకుడిని మెచ్చుకోవాలి, ముందే చెప్పినట్లు దేశవాళీ వినోదంతో నవ్వించే ప్రయత్నం చేశారు, కాకినాడ,కరీంనగర్, భీమిలి లాంటి ప్రదేశంలో సినిమా తీసి మన సినిమా అనే ఫీలింగ్ కలిగించాడు,అయితే అక్కడక్కడా కొన్ని అనవసర సన్నివేశాలు మినహా దర్శకుడిగా తన ముద్ర బాగానే వేశాడు,అలాగే నగేష్ కెమెరా పనితనం చాలా బాగుంది,రవిచంద్ర అందించిన బ్యాక్ రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి బలం అనే చెప్పాలి, ఎడిటింగ్ పరంగా వెంకట్ ఇంకొన్ని కత్తెరలు వేస్తే బాగుండేది,శివ రాజు కనుమూరి దర్శకుడిగా ఎంత మెప్పించాడో నిర్మాతగా కూడా సినిమా విలువలని పాటిస్తూ అలాగే మెప్పించాడు

  చివరి మాట : ఒక కమెడియన్ హీరోగా మారి చేసిన సినిమా కాబట్టి మొదటి నుండి నవ్వుకోవచ్చని సినిమాకి వెళ్ళకండి,ఒక ఆహ్లాదకరమైన సినిమా చూడటానికి,మన చుట్టూ వున్నా సమాజంలో వుండే మనుషులు పాత్రలు చూడటానికి వాటితో వచ్చే వినోదాన్ని చూసి నవ్వుకోటానికి వెళ్ళండి.

  గవ్వ కామెంట్: నిశ్చయంగా నవ్వుకోవచ్చు…
  గవ్వ రేటింగ్ : 2.75 / 5

  గమనిక: ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *