• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  రికార్డు సృష్టించిన జనతా టీఆర్పీ రేటింగ్

  janatha-garage

  జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది, కొరటాల శివ దర్శకత్వంలో మోహన్ లాల్,సమంత, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం కొన్ని నాన్ బాహుబలి రికార్డ్స్ ని తిరగరాసింది, ఈ సినిమాని తాజాగా ఒక ప్రధాన టీవీ ఛానల్ టెలికాస్ట్ చేసింది దానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ విషయంలో రికార్డ్స్ సృష్టించింది.
  అక్టోబర్ 23 న టెలికాస్ట్ అయిన జనతా గ్యారేజ్ సినిమా 20.69 రేటింగ్ తో ఈ ఏడాది టాప్ రేటింగ్ సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది , తమిళ డబ్బింగ్ సినిమాగా వచ్చి తెలుగులో ఘన విజయం సాధించిన ‘బిచ్చగాడు’ దాదాపు 18 రేటింగ్ సాధించింది, ఇప్పడు జనతా గ్యారేజ్ ఆ రికార్డు ని తుడిపేశాడు, అటు వెండి తెర మీదే కాకుండా ఇటు బుల్లి తెర మీద కూడా ఎన్టీఆర్ తన హవా చూపించాడు.
  అయితే ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ కావటానికి ముందే కొన్ని ఆన్ లైన్ సైట్ లో దర్శనమిచ్చినా.. అలాగే అదే రోజు ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతున్నా రికార్డు స్థాయిలో రేటింగ్ సాధించటం అంటే మాములు విషయం కాదని ఎన్టీఆర్ అభిమానులు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, ఆలోచిస్తే అందులో కూడా నిజం లేకపోలేదు,

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *