• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ప్రజల్లోకి మరోసారి జనసేన.. అనంతపురంలో..

  janasena-party-is-set-to-hold-third-public-meeting-in-anantapur

  ప్రత్యేక హోదా గురించి పోరాడడం కోసం మరోసారి సిద్ధం అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నవంబర్ 10వ తేదీన అనంతపురంలో బహిరంగ సభ పెడతానని ప్రకటించారు. సభాస్థలం, సమయం త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. తిరుపతి సభలో చెప్పినట్లుగానే రాష్ట్రంలో అన్ని జిల్లాలో సభలు పెడ్తానన్నారు. అందులో భాగంగానే అనంతపురంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు పవన్.

  ఏపీకి హోదా వస్తే, వెనకబడి ప్రతియేటా కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు ఉపయోగంగా  ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. హోదా వల్ల వచ్చే నిధులతో ఆ జిల్లాలను కరువునుంచి కాపాడుకోవచ్చు అన్నారు. అందువల్లే అనంతపురంలో సభ పెడ్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ లోనే ఈ సభ పెట్టాలని పవన్ భావించారు కానీ ఎల్ఓసి లో సర్జికల్ దాడుల నేపథ్యంలో సభ పెట్టడం సరికాదని విరమించుకున్నారు. కాబట్టి నవంబర్ కు ఈ సభ వాయిదా వేసినట్లు పవన్ ప్రకటించారు. ఈ వివరాలతో జనసేన పార్టీ నుంచి ఒక ప్రకటన విడుదలైంది.

  ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ ఈ సందర్బంగా మరోసారి స్పష్టం చేసారు. సామజిక సమస్యలపైనా పోరాటం చేస్తానన్నారు. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో ‘ఆక్వా ఫుడ్ పార్క్’ పై స్పంధించానని గుర్తుచేశారు. ఇప్పటికే రెండుసార్లు బహిరంగ సభలు పెట్టారు పవన్ కళ్యాణ్. మొదటిది ఆగష్టు 27వ తేదీన తిరుపతిలో సభ పెట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని నినదించారు. ఇచ్చేవరకు పోరాటం చేస్తానన్నారు, హోదా కోసం మూడు దశల్లో పోరాటం చేస్తానని తిరుపతి సభలోనే ప్రకటించారు పవన్ కళ్యాణ్. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తీరుపైనా ఆ సభలో నిప్పులు చెరిగారు పవన్. చివరి దశలో రోడ్ల పైకి వచ్చి పోరాటం చేస్తానని చెప్పారు.

  పవన్ తిరుపతి సభ తర్వాతనే కేంద్రం నుంచి ప్రకటన వచ్చింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకెజీ ఇస్తామని ఢిల్లీలో ప్రకటించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 9వ తేదీన కాకినాడలో సభ పెట్టారు పవన్. కేంద్రం ప్రకటనపై కాకినాడలో తీవ్ర విమర్శలు చేసారు పవన్ కళ్యాణ్. పాచిపోయిన రెండు లడ్డులు ఇచ్చారని అవి ఎవరికి కావాలని మండిపడ్డారు. ఎంపీల తీరుని తప్పుబట్టారు. ప్రధానంగా కాకినాడలో బీజేపీ తీరును తప్పుబట్టారు పవన్. ఇప్పుడు మరోసారి అనంతపురం వేదికగా ప్రత్యేక హోదాపై తన గళాన్ని వినిపించడానికి సిద్ధం అయ్యారు పవన్ కళ్యాణ్.

  janasena to hold meeting in ananthapuram

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *