• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మూవీ రివ్యూ : జానకి రాముడు

  janakiramudu-review

  మూవీ రివ్యూ : జానకి రాముడు

  ప్రధాన తారాగణం : నవీన్ సంజయ్,మౌర్యాని,ప్రియాంక,అర్జున్,సుధ,పవిత్ర లోకేష్,శివ కృష్ణ,సూర్య, జాకీ, సుదర్శన్, గీతాంజలి తదితరులు

  సంగీతం : గిఫ్టన్ ఎలియాస్

  ఛాయాగ్రహణం : అనిత్

  ఎడిటింగ్ : నాగేంద్ర అడపా

  సాహిత్యం : శ్రీమణి, అనంత శ్రీరామ్

  నిర్మాత : ఎం .పి. నాయుడు

  నిర్మాణ సంస్థ : కావేరి మీడియా

  కథ-మాటలు-దర్శకత్వం : తమ్మినీడి సతీష్ బాబు

  ఈ మధ్య కాలంలో మన తెలుగు నేటివిటీ వున్న సినిమాలు తగ్గిపోయానే చెప్పాలి, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి సినిమాలు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించటం లేదు అందుకనే అలాంటి సినిమాలు తగ్గిపోయాని చెప్పే దర్శక నిర్మాతలు లేకపోలేదు. అయితే సరైన కథతో ఒక మంచి సినిమా చేస్తే తప్పకుండా ఆదరిస్తారని అనేక సినిమాలు నిరూపించాయి. తాజాగా తెలుగుతనంతో తెరకెక్కించిన జానకిరాముడు అనే సినిమా ఈ రోజే (16) ప్రేక్షకుల మధ్యకి వచ్చింది.కావేరి మీడియా బ్యానర్ పై ఎం.పి నాయుడు నిర్మాతగా తమ్మినీడి సతీష్ బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరి వీళ్ళు  చేసిన ప్రయతాన్ని మన ప్రేక్షకులు ఎంత వరకు ఆదరించారో చూద్దాం…

  కథ: రాము (నవీన్ సంజయ్ ) తొలి చూపులోనే జానకి (మౌర్యాని) ని చూసి ఇష్టపడుతాడు. ఆమెకి తన ప్రేమని చెప్పి ఒప్పిస్తాడు,అయితే పల్లెటూరిలో వుండే గొడవలు కారణంగా పెద్దలు వీళ్ళ ప్రేమని ఒప్పుకోవటం జరగదు,మరి పెద్దల్ని వీళ్ళు ఒప్పించారా..? లేదా…? చివరికి వీళ్ళ ప్రేమ కథ ఏమైంది అనేది అసలు ఈ సినిమా  యొక్క మూల కథ. ఈ సినిమాలో మొదటి భాగం చాలా ఆసక్తిగా సాగిపోతుంది. పక్క పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాని చూస్తుంటే చాలా ప్రెష్ గా అనిపిస్తుంది. “ఆడవాళ్ళ మనసు తెరచి ఉంచిన పుస్తకం లాంటిది.. చదవగలిగిన వాడు ప్రేమికుడు, చదవలేని వాడు స్నేహితుడు” అంటూ సాగే అనేక డైలుగులు ఈ సినిమాలో అనేకం వున్నాయి.అయితే కథ సెకండ్ ఆఫ్ లోకి వెళ్ళాక కొంచం ఆసక్తి తగ్గినట్లు అనిపించినా ఫైనల్ గా సినిమాని బాగానే తెరకెక్కించారు

  నటీనటులు : హీరోగా నవీన్ సంజయ్ మన పక్కింటి కుర్రడిలా బాగానే మెప్పించాడు.కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో అతడి నటన చాలా బాగుంది.అలాగే రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా బాగానే ఆకట్టుకున్నాడు. డైలాగు డెలివరీ విషయంలో అతను ఇంకొంచం మెరుగుపడాల్సిన అవసరం వుంది. ఇక హీరోయిన్ గా మౌర్యాని తన నటనతో ఆకట్టుకుంది.ఆమె స్క్రీన్ ప్రజంటేషన్ చాలా బాగుంది. ఇక ఇందులో ఎక్కువ చెప్పుకోవాల్సింది సీనియర్ నటుల గురించి జాకీ,సుధ,పవిత్ర లోకేష్,సుదర్శన్ లాంటి వాళ్ళు ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారనే చెప్పాలి.

  సాంకేతిక వర్గం : కొత్త దర్శకుడు అయినా సతీష్ తన తోలి సినిమానే ఇలాంటి కథని ఎంచుకున్నందుకు ముందుగా మెచ్చుకోవాలి.ఈ సినిమాలో ఒక దర్శకుడిగా ఎన్ని మార్కులు పడుతాయో ఒక రచయితగా కూడా అంతకంటే ఎక్కువ మార్కులే పడుతాయి. ఆ తరవాత చెప్పుకోవలసింది ఈ సినిమా యొక్క కెమెరా పనితనం గురించి అనిత్ తన కెమెరాతో పచ్చని పల్లెటూరి అందాలని బాగానే ఒడిసిపట్టాడు. మ్యూజిక్ పరంగా చుస్తే గిఫ్టన్ ఎలియాస్ కంపోజ్ చేసిన సాంగ్స్ చాలా బాగున్నాయి.శ్రీమణి,అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం బాగా కుదిరింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కొంచం అక్కడక్కడా తగ్గినట్లు అనిపిస్తుంది,కానీ ఓవరాల్ గా ఈ సినిమాకి గిఫ్టన్ అందించిన మ్యూజిక్ చాలా బాగా కుదిరింది. ఇలాంటి సినిమాతో నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేసిన ఎం.పి నాయుడు గారి గురించి ముఖ్యంగా మాట్లాడాలి, మనం పైన చెప్పుకున్నట్లు మొదటి సినిమానే అయినా ఎక్కడ ఖర్చుకి వెనకడుగు వేయకుండా ఈ సినిమాని నిర్మించిన విషయాన్ని మనం గమనించాలి. “కావేరి సంస్థ” యొక్క నిర్మాణ విలువలు ప్రతి ఫేమ్ లో కనిపిస్తుంది.

  చివరి మాట : స్వచ్ఛమైన ప్రేమ కథని అలాగే తెలుగు నేటివిటీని ఆస్వాదించాలి అంటే తప్పకుండా చూడవలసిన సినిమా జానకి రాముడు

  గవ్వ కామెంట్ : లవ్ అండ్ ఎమోషనల్ రాముడు

  గవ్వ రేటింగ్ : 2.75 /5

  గమనిక : కేవలం ఇది మా అభిప్రాయం

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *