• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  హోదా వస్తే ఏమవుతుందన్నది జగన్ చెప్పారు

  jagan-explains-benefits-from-andhra-special-status-1473497048-1069-1

  ప్రత్యేకహోదా అంశం ఏపీని ఆగమాగం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొండ మీద కోతి తెచ్చి ఇచ్చినా.. హోదా ముందు బలాదూర్ అన్న భావన కలిగిస్తోంది. నిజంగానే హోదాతోఅంత లాభం కలుగుతుందా? అన్నది ఒక ప్రశ్న. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హోదా కారణంగా లాభం ఎంతో జరుగుతుందని దాన్ని కోరుకుంటున్న వారు చెబుతుంటే.. అంత సీన్ లేదని బీజేపీ వర్గాల వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సీమాంధ్ర మేధావులు సైతం చైతన్యవంతంగా వ్యవహరించకపోవటం లేదనే విమర్శ ఉంది. ఎందుకంటే.. హోదాతో కలిగే లాభాల్ని సామాన్యులకు అర్థమయ్యేలా వివరించటం.. అదెందుకు అవసరమన్న వాదన ప్రతిఒక్కరూ తయారు చేయాల్సిన అవసరం ఉంది. అదే జరిగితే.. ప్రజలే నాయకుల్ని నిలదీసే అవకాశం ఉంది. హోదాతో కలిగే కచ్ఛితమైన లాభనష్టాలపై పూర్తి స్థాయి అవగాహన వస్తే.. ప్రజలు వేసే ప్రశ్నలకు నేతలు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది.

  అందుకేనేమో.. హోదా అంశంపై సామాన్యుల్లో మరింత అవగాహన కలిగించాల్సిన అవసరాన్ని ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించినట్లుగా కనిపిస్తోంది. హోదా.. హోదా అంటూ తరచూ చేసే డిమాండ్ కారణంగా కలిగే లాభం ఏమిటన్న విషయాన్ని ఆయన వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. గడిచిన కొద్దిరోజుల్లో ఈ స్థాయిలో హోదా గురించి వివరించిన నేత కనిపించలేదనే చెప్పాలి.

  హోదా మీద ప్రచారంలో ఉన్న అంశాలుపై జగన్ చెప్పిన అంశాల్ని చూస్తే..

  = 14వ ఆర్థిక సంఘం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పినట్లుగా అరుణ్ జైట్లీ చెబుతున్నారు. దీన్ని చంద్రబాబు స్వాగతించారు. ఒక్క పేరాలో కూడా 14వ ఆర్థిక సంఘం ఏపీకి హోదా ఇవ్వొద్దన్న విషయాన్ని చెప్పినట్లు కానీ.. ఒప్పుకోలేదని కానీ చెప్పినట్లు చూపించగలరా? వాళ్లు చెప్పిందేమంటే.. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రమైనా.. హోదా లేని రాష్ట్రమైనా సరే రెవెన్యూలోటు ఉంటే.. దాన్ని పూడ్చేందుకు చర్యలు తీసుకున్నరు. అంతేకానీ ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వకూడన్న మాట 14వ ఆర్థిక సంఘం నివేదికలో చెప్పలేదు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను రద్దు చేయాల్సిందిగా చెప్పలేదని పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలో మాజీ కేంద్రమంత్రి జైరాం రమేశ్ కు సదరు ఆర్థిక సంఘంలో సభ్యుడైన అభిజిత్ సేన్ జీమొయిల్ పంపారు.

  = 14వ ఆర్థిక సంఘం ఏపీకి హోదా అక్కర్లేదని చెప్పలేదు. ఒకవేళ చెప్పిందే అనుకుందాం. చెప్పినా అది సిఫార్సు మాత్రమేతప్పించి అదేమీ రూల్ కాదు కదా? సిఫార్సును పాటిస్తారా? లేదా? అన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుందే తప్పించి.. ఆ సిఫార్సును కచ్ఛితంగా అమలు చేయాల్సిన అవసరమైతే ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

  = హోదాతో లాభం జరగదని అనుకుంటే.. మరి హోదా అంశాన్ని ఎన్నికల మేనిఫేస్టోలో ఎందుకు పెట్టినట్లు? పదేళ్ల పాటు హోదా కావాలని ఎందుకు అడిగినట్లు? విడగొట్టేటప్పుడు హోదా ఇస్తామని ఎందుకు చెప్పినట్లు? విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీని ఎందుకు ఇచ్చారన్నది చూస్తే.. హైదరాబాద్ నగరం మన దగ్గర నుంచి వెళ్లిపోతోంది. 70 శాతం తయారీ సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయి. 90 శాతం ఐటీ కంపెనీలు హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఇప్పుడున్న హైదరాబాద్ ను తయారు చేయటానికి 65 ఏళ్లు పట్టింది. ఇప్పటికి ఉద్యోగం అన్న వెంటనే ప్రతి తెలుగోడి చూపు హైదరాబాద్ మీదనే పడుతుంది. తెలుగు మాట్లాడే ప్రతి తెలుగు విద్యార్థి చూపుహైదరాబాద్ మీదనే ఉంటుంది. ఎందుకంటే ఈ మహా నగరంలో తెలుగు మాట్లాడేవారికి హైదరాబాదే అండ అనుకున్నారు కాబట్టి భాగ్యనగరిని చూస్తారు. అలాంటి మహానగరం ఏపీకి దూరం అవుతున్న నేపథ్యంలో సీమాంధ్రకు హోదా ఇచ్చేందుకు కేంద్రం నాడు హోదాకు ఓకే చెప్పారు.

  = హోదా వస్తే ఏపీకి ఎంత లాభం అన్న విషయానికి వస్తే.. 15 శాతం అదనపు యాక్సిలరేషన్.. 15 శాతం అదనపు మూలధన అలవెన్స్ లు రాయితీలుగా పేర్కొంటున్నారు. అయితే.. ఇవన్నీ తెలంగాణకు కూడా ఇచ్చారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేకఆర్థిక ప్రోత్సాహకాలు ఉంటాయి. 100 శాతం ఎక్సైజ్ సుంకం.. 100 శాతం ఆదాయపు పన్ను మినహాయింపు.. 50 శాతం విద్యుత్ రాయితీ.. రవాణా ఛార్జీల రీయింబర్స్ మెంట్ లాంటివన్నీఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి రాయితీలు ఉంటే పారిశ్రామికవేత్తలు వస్తారు. వేల కంపెనీలు వస్తాయి.. లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. అందుకే.. ఆ రోజు హోదా అడిగారు.

  = ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలకు జీఎస్టీ చట్టంలో ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. జీఎస్టీ నిబంధనల ప్రకారం వస్తువు తయారు అయ్యే రాష్ట్రంలో పన్ను వేయరు. వస్తువును వినియోగించే రాష్ట్రంలో పన్ను వేస్తారు. హోదా ఉన్న రాష్ట్రాల్లో పాత విధానాన్నే అమలు చేస్తారని చెబుతున్నారు. అందుకే..ఏపీకి హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *