• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్య

  Jabardasth Comedian Potti Ramesh Wife Commits Suicide

  ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ లో కమెడియన్ గా అందరిని నవ్వించే పొట్టి రమేష్ భార్య త్రిపురాంబిక ఆత్మహత్య చేసుకుంది. విశాఖపట్టణం, గాజువాకలోని శ్రీనగర్‌లో ఈ ఘటన జరగటంతో స్థానికంగా పెను చంచలనం సృష్టించింది. అయితే వీళ్ళ పెళ్లి అయ్యి కేవలం ఏడాది మాత్రమే కావటం వెంటనే ఇలా ఆమె ఆత్మహత్య చేసుకోవటం అనేక అనుమానాలకు దారితీస్తుంది.

  2015  డిసెంబర్ 12 న నెల్లూరుకి చెందిన త్రిపురాంబిక కు పొట్టి రమేష్ కి వివాహం అయ్యింది. అప్పటి నుండి వీళ్లు గాజువాక శ్రీనగర్ లోనే వుంటున్నారు.మూడు రోజులు షూటింగ్ ఉందని హైదరాబాద్ వెళ్ళిపోయాడు.వెంటనే ఈ ఘటన జరగటంతో తిరిగి వైజాగ్ వచ్చాడు. పెళ్లి అయినా దగ్గర నుండి మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం మా మధ్య ఎలాంటి మనస్పర్థలు కూడా లేవని తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పొట్టి రమేష్ ని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు.

  త్రిపురాంబిక ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే ఆమె తల్లిదండ్రులు, బంధువులు విశాఖ చేరుకున్నారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదని,ఆమె అత్తా ఆడపడుచులు బాగా వేధించేవాళ్ళని, కనీసం నాతో మాట్లాడాలన్నా మా కూతురు భయపడేది, రాత్రి పూట రెండు,మూడు గంటలకి దొంగతనంగా మాకు ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి నా కూతురికి కల్పించారని, వాళ్ళు అందరూ కలిసి మా అమ్మాయిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *