• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  పిఎస్ఎల్వి సి-35 ప్రయోగం వియజవంతం…

  isros-pslv-c-35-places-scatsat-1-weather-satellite-in-orbit

  పిఎస్ఎల్వి సి-35 ప్రయోగం వియజవంతం అయింది. దీంతో ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. 8 ఉపగ్రహాలను విభిన్న కక్షలో కి విజయవంతంగా ప్రవేశపెట్టింది ఇస్రో. నింగికి ఎగిసినప్పటి నుండి శాత్రవేత్తల అంచనాలకు అనుగుణంగా సాగిన పిఎస్ఎల్వి సి-35 పని పూర్తి చేసింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేసారు.

  ఒకే ప్రయోగం లో విభిన్న ఉపగ్రహాలను రెండు వేర్వేరు కక్షలలోకి ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. మొదటిగా స్కాట్ శాట్-1 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి చేర్చింది  పిఎస్ఎల్వి సి-35. స్కాట్ శాట్-1 తో నిరంతరం వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. తుపానులను, సునామి లను ముందే గుర్తించడంతో పాటు వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది స్కాట్ శాట్-1 ఉపగ్రహం. ఇది 15 ఏళ్ళ పాటు సేవలందించనుంది.

  స్కాట్ శాట్-1 ను విజయవంతంగా కక్షకు చేర్చిన పిఎస్ఎల్వి సి-35 వాహన నౌక మిగిలిన ఉపగ్రహాలను కూడా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఐతే దీని కోసం ముల్టీపుల్ బర్డ్ టెక్నాలజీని వినియోగించారు శాస్త్రవేత్తలు. 2:15 నిమిషాల్లో ప్రయోగం పూర్తయింది.

  పిఎస్ఎల్వి సి-35 ద్వారా మొత్తం 8 ఉపగ్రహాలను నిర్ణిత కక్షలోకి చేర్చారు శాస్త్రవేత్తలు ఇందులో మూడు దేశీయ ఉపగ్రహాలు కాగా 5 విదేశాలకు చెందిన ఉపగ్రహాలు. దేశీయ ఉపగ్రహాలు స్కాట్ శాట్-1, ప్రదమ్, పిట్ శాట్ లు ఉన్నాయి. అల్జీరియా కు చెందిన ఆల్ శాట్ 1B, ఆల్ శాట్ 2B, ఆల్ శాట్ 1N ఉపగ్రహాలు అమెరికా కు చెందిన పాథ్ ఫైండర్  ఉపగ్రహం, కెనడా కు చెందిన పిఎస్ఎల్ఎస్-19 ఉపగ్రహాలు నింగికి ఎగిశాయి. ఈ ఉపగ్రహాల బరువు మొత్తం 675 కేజీలు. పిఎస్ఎల్వి సి-35 ప్రయోగం విజయవంతం కావడం తో ప్రధాని మోడీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కెసిఆర్ లు ఇస్రో శాత్రవేత్తలను అభినందించారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *