• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  సిరీస్ గెలిచేనా.. చివరి ఫైనల్ మ్యాచ్ వైజాగ్ లో..

  india-vs-newzealand-last-and-final-match-to-be-held-in-vishakapatnam

  ఇండియా న్యూజిలాండ్ మధ్య చివరి వన్ డే ఈ రోజు విశాఖపట్నం లో జరగనుంది, మధ్యాహ్నం 1:30 నుంచి మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఒక రకంగా ఈ మ్యాచ్ ఫైనల్ లాంటిది అని చెప్పవచ్చు. 5 మ్యాచ్ ల సిరీస్ ను చెరో రెండు మ్యాచులు గెలిచి 2-2 తో సమానంగా ఉన్నారు. కావున ఈ రోజు మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ గెలిచినవారు సిరీస్ కైవసం చేసుకుంటారు. ఈ మ్యాచ్ కు వైజాగ్ వేదిక కావడంతో స్టేడియం నలువైపులా ఇప్పటికే అభిమానులతో కోలాహలంగా మారింది.

  టెస్ట్ సిరీస్ ను కోహ్లీ సేన న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించి 3 -0 తో కైవసం చేసుకుంది. ఇదే ఊపులో వన్ డే  సిరీస్ లో అడుగు పెట్టిన భారత్ కు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. వన్ డే ఫార్మాట్ లో రెండు టీం లు బలంగానే ఉన్నా, భారత్ పై చేయి సాదిస్తుందని అంతా అనుకున్నారు, 5-0 తో సిరీస్ దక్కించుకుంటుంది అనుకున్నారు, కానీ న్యూజిలాండ్ పట్టుదలతో ఆడి రెండు మ్యాచులు గెలుచుకుంది. దీంతో ఆఖరి మ్యాచ్ ఫైనల్ గా మారింది.

  ధోనికి వైజాగ్ స్టేడియం బాగా అచొచ్చిన స్టేడియం. ఇందులోనే ధోని తన మొదటి సెంచరీ చేసాడు.. 148 పరుగులు కేవలం 123 బంతుల్లో చేసాడు. ఆ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మధ్యన జరిగింది. ఈ రోజు జరగబోయే చివరి మ్యాచ్ కు టాస్ కూడా కీలకం కానుంది. ఈ మ్యాచ్ రసవత్తరంగా జరగనుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మ్యాచ్ ని గెలిచి సిరీస్ ని కైవసం చేసుకోవాలని .. అల్ ది బెస్ట్ టీం ఇండియా.. from Gavva media..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *