• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  15 ఏళ్ళల్లో 10 లక్షల కోట్ల డాలర్లకు భారత్…

  india-needs-to-capture-some-of-the-world-markets-if-it-has-to-sustain-an-8-10-percent-growth-rate

  ప్రస్తుతం భారత్ ఆర్థిక స్థోమత  670 లక్షల కోట్లు. అంటే దేశీయ ఆర్థిక వ్యవస్థలో 2 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. వచ్చే 15 ఏళ్ళల్లో దేశీయ ఆర్థిక వ్యవస్థ 10 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోనుందనీ నీతి అయోగ్ వైస్-చైర్మన్ అరవింద్ పనగరియా అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో చైనా తర్వాత అధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న భారత్. గడిచిన 15 ఏళ్ళల్లో చైనా సాధించిన వృద్ధిని వచ్చే 15 ఏళ్ళల్లో భారత్ సాదించనున్నదని ఇండస్ట్రీ బాడీ ఫిక్కీ ఏర్పాటు చేసిన ఇండియా- చైనా ఇన్వెస్ట్మెంట్ సమావేశంలో ఆయన వెల్లడించారు.

  15 ఏళ్ళ క్రితం 2 లక్షల డాలర్లుగా ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ.. ప్రస్తుతం 10 లక్షల కోట్లకు చేరుకుంది. వచ్చే 15 ఏళ్ళను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రోడ్ మ్యాప్ ను రూపొందించినట్లు, ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా బ్లూప్రింట్ ను సిద్ధం చేసినట్లు అయన చెప్పారు. వచ్చే 15 ఏళ్ళు వరుసగా పది శాతం వృద్ధిని సాధిస్తేనే భారత ఆర్థిక వ్యవస్థ 10 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోనుందనీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా కొనసాగుతున్నప్పటికీ భారత్, చైనా దేశాలు వెలిగిపోతున్నాయన్నారు. ప్రపంచానికి, ఆసియాకు భారత్-చైనాలు పవర్ హౌస్ గా మారాయని ఎన్డీఆర్సీ చైర్మన్ షావోషి తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడంలో ఇరు దేశాలు పోటీపడుతున్నాయన్నారు.

  మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియాతో భారత్ దోసుకుపోతుండగా, చైనా తయారీ రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటుందని చెప్పారు. విద్యుత్, మౌలిక, ఇతర రంగాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రూపొందించిన నివేదికను ఫిక్కీ శుక్రవారం విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని, అప్పుడే అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించేందుకు అవకాశం ఉంటుందని అయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రసంశలు కురిపించారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *