• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మూవీ రివ్యూ&రేటింగ్: గౌతమిపుత్ర శాతకర్ణి

  Gautamiputra sataakrni movie review and rating

  మూవీ రివ్యూ&రేటింగ్: గౌతమిపుత్ర శాతకర్ణి

  ప్రధాన తారాగణం : బాలకృష్ణ,శ్రీయ,హేమ మాలిని,శివ రాజ్ కుమార్,కబీర్ ఖాన్,తనికెళ్ల భరణి, తదితరులు

  సంగీతం : చిరంతాన్ భట్

  ఛాయాగ్రహణం : జ్ఞాన శేఖర్ వి.ఎస్

  ఎడిటింగ్ : సూరజ్ జగ్తాప్,రామకృష్ణ యర్రం

  నిర్మాత : రాజీవ్ రెడ్డి,సాయి బాబా

  సమర్పణ : బిబో శ్రీనివాస్

  నిర్మాణ సంస్థ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్

  మాటలు: బుర్రా సాయి మాధవ్

  కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : క్రిష్

  తెలుగు జాతి గర్వించదగిన మహా యోధుడు “గౌతమిపుత్ర శాతకర్ణి”. తల్లి పేరుని తన పేరు ముందు చేర్చుకున్న మొదటి చక్రవర్తి. అనేక చిన్న చిన్న రాజ్యాలుగా వున్నా అనంత భారతావనిని ఏకం చేసి పరిపాలించిన ధీరుడు మన శాతకర్ణి. ఇలాంటి మహోన్నత చరిత్ర కలిగిన శాతకర్ణి గురించి ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. మరుగున పడిపోయిన చరిత్ర పుటలలో నుంచి వెలుగుతీసిన చరిత్రని,తెలుగు జాతి గొప్పతనాన్ని మన ముందు ఆవిష్కరించే ప్రయత్నమే ఈ “గౌతమిపుత్ర శాతకర్ణి”. బాలయ్య బాబు నటించిన ఈ సినిమాని క్రిష్ తెరకెక్కించాడు. ఎన్నో అంచనాలు మధ్య ఈ రోజే (12) విడుదల అయినా ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…

  మూలకథ: స్థిరమైన పరిపాలన అనేది లేకుండా అస్తవ్యస్తంగా వున్నా అనేక చిన్న రాజ్యాలని ఏకం చేస్తేనే సుపరిపాలన సాధ్యమని నమ్మిన రాజు శాతకర్ణి. ఇందు కోసం యుద్ధమే సరైన మార్గం అని తలచి అనేక యుద్దాలు చేసి చిన్న చిన్న రాజ్యాలని తన కిందకి తెచ్చుకుంటాడు. ఈ క్రమంలో తనకి తన భార్యకి మధ్య దూరం పెరిగిపోతుంది. ఇది ఇలా ఉండగా విదేశీ శత్రువుల నుండి భారత ఖండానికి ముప్పుందని గ్రహించిన శాతకర్ణి వాళ్ళని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో యుద్దానికి సిద్ధం అవుతాడు.. ఆ యుద్ధంలో శత్రువులని శాతకర్ణి సంహరించడా..? లేడా…? శాతకర్ణికి అతని భార్యకి మధ్య ఎందుకు అగాధం ఏర్పడింది..? తన కొడుకునే యుద్ధ భూమికి ఎందుకు తీసుకోని వెళ్ళవలసి వచ్చింది..? శాతకర్ణికి అతని తల్లి ఏ విధమైన సహాయం అందించింది…? ఆయన పేరుకి ముందు తన తల్లి పేరు పెట్టుకోటానికి గల కారణాలు ఏమిటి..? అనేది మిగిలిన కథ  

  విశ్లేషణ: తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని ఇప్పటి తరాలకు,ముందు తరాలకు అందించాలనే ఆశయంతో ఈ సినిమాని తెరకెక్కించిన క్రిష్ ని అభినందించాలి. అదే విధంగా తన 100 వ సినిమాగా ఇలాంటి చారిత్రాత్మకమైన సినిమాని ఒప్పుకున్నా బాలయ్య బాబు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇక సినిమా పరంగా చుస్తే ఇలాంటి సినిమాని కేవలం 79 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి 8 నెలల వ్యవధిలోనే ఈ విధమైన అవుట్ పుట్ తీసుకోనిరావటం అనేది మాములు విషయం కాదు.

  ఈ సినిమాలో బాలయ్య బాబు ఎంట్రీ సన్నివేశమే అదుర్స్ అని చెప్పాలి. యుద్ధ సన్నివేశంతోనే బాలకృష్ణ కనిపించటం జరుగుతుంది. ఆ తర్వాత అతని భార్య వశిష్టి దేవిగా శ్రియ కనిపిస్తుంది. కాసేపు ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది. ఆ తర్వాత మరో కళ్ళు చెదిరే యుద్దానికి సర్వం సిద్ధం అవుతుంది. ఈ యుద్ధం కోసం తన కొడుకైన “పుల్లోమవి”ని యుద్ధ భూమికి తీసుకోని వెళ్లే సన్నివేశంలో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అదే విధంగా ఇందులో బాలకృష్ణ చెప్పే డైలగులు ప్రతి ఒక్కరిలో పౌరుషాన్ని రగిలిస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు.

  అయితే ఈ సినిమాలో అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాల వలన  స్లో నెరేషన్ అనిపిస్తుంది. అదే విధంగా ఇలాంటి సినిమాలో ఎమోషనల్ అనేది  “కీ రోల్” పోషిస్తుంది. చాలా వరకు అది సక్సెస్ అయినా కొన్ని సన్నివేశాల్లో కనెక్ట్ అవ్వలేదనేది వాస్తవం. అయితే ఇలాంటి సినిమాని చెప్పాలనుకోవటం చాలా గొప్ప విషయం. చందమామకే మచ్చలు వెతికే మనకి, ఇలాంటి సినిమాలో చిన్న చిన్న లోపాలు కనిపించటం సహజం. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రతి తెలుగు వాడికి నచ్చే సినిమా ఈ “శాతకర్ణి”  

  నటీనటులు: శాతకర్ణి మహారాజు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు.ఇక ఇప్పటి నుండి బహుశా బాలకృష్ణ లాగే ఉంటాడేమో అనుకోవాలి. ఆ విధంగా బాలయ్య బాబు ఈ పాత్రలో ఒదిగి పోయాడు. యుద్ధ సన్నివేశాల్లో ఆయన చేసిన వీరోచిత పోరాటాలకు మైమరచిపోవటం ఖాయం. అదే విధంగా తన తల్లి గురించి చెప్పే సీన్స్ లో కానీ, శత్రువులను హెచ్చరిస్తూ బాలయ్య చేసే సింహ గర్జన సీన్స్ లో ఆయన 99  సినిమాల అనుభవం కనిపిస్తుంది. ఈ వయస్సులో ఎలాంటి డూప్ లేకుండా నటించటం అనేది మాములు విషయం కాదు. ఈ సినిమా చుస్తే అర్ధం అవుతుంది ఆయనని ఎందుకు “నటసింహం” అని అంటారో… శాతకర్ణి పాత్రకి బాలకృష్ణ సరిపోలేదు, ఆయన బాడీ లాంగ్వేజ్ సెట్ అవలేదన్న వాళ్ళకి ఈ సినిమా ఒక చెంప దెబ్బలాంటిది.

  ఆ తరవాత చెప్పుకోవాల్సింది హేమ మాలిని గురించి. ఒక యుద్ధ వీరుడి తల్లిగా హేమ మాలిని నటన అమోఘం. క్రిష్ బృందం పట్టు పట్టి మరి ఆమెనే ఈ సినిమా కోసం ఎందుకు ఎంచుకున్నారో సినిమా చుస్తే అర్ధం అవుతుంది. అలాగే శాతకర్ణి భార్యగా శ్రియ అద్భుతమైన నటన కనపరిచింది. ఒక పక్క భర్త మాటని కాదనలేక, మరో పక్క అత్తగారి మాటకి ఎదురు చెప్పలేక, యుద్దానికి తన భర్తని పంపలేక సతమతం అవుతూ, అదే విధంగా తన కన్న బిడ్డలను కంటికి రెప్పలా చూసుకునే పాత్రలో ఆమె ఒదిగిపోయింది.మిగిలిన వాళ్ళు తమ పాత్రల మేర నటించారు.

  సాంకేతిక వర్గం :  ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు క్రిష్ గురించి, ఎవరికీ తెలియని ఒక వీరుడి కథని చెప్పాలనుకొని అందుకు తగిన గ్రౌండ్ వర్క్ చేసి తనకి తెలిసిన సమాచారాన్ని సేకరించి, కొంచం సినిమాటిక్ జత చేసి అతి తక్కువ కాలంలోనే, కేవలం 50 కోట్ల బడ్జెట్ లోపే ఈ సినిమాని పూర్తి చేయటమనేది గొప్ప విషయం. క్రిష్ గత సినిమాలకి ఈ సినిమాకి ఎక్కడ ముడి పెట్టి చూడకూడదు, ఆ సినిమాల్లో క్రిష్ యొక్క డ్రామా, ఆయన ట్రేడ్ మార్క్ కనిపిస్తుంది. అయితే ఈ సినిమా చరిత్రకి సంబంధించింది కాబట్టి, ఈ జోన్ లోనే సినిమాని తీయటానికి ప్రయత్నించాడు. ఇక మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగులు అయితే అద్భుతం, ఒక్కో డైలుగు అయితే మనసు లోతులోకి చొచ్చుకొని వెళ్ళటం ఖాయం.

  అందులో మచ్చకు కొన్ని 1.)మమకారం..అహంకారం రెండు లేనివాడే నాయకుడు అవుతాడు
                                      2.)మగనాలికి గాజులు అందం..మగాడికి గాయాలు అందం
                                       3.)శరణం అంటే శిక్ష..రణం అంటే మరణ శిక్ష ఇది కావాలి

  అదే విధంగా  జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆయన కెమెరా పనితనం ఈ సినిమాకి రాజరిక లుక్ ని తీసుకోని వచ్చింది. అలాగే చిరంతాన్ భట్ అందించిన పాటలు కానీ, నేపధ్య సంగీతం కానీ ఈ సినిమాని మరో మెట్టు ఎక్కించాయి. అన్ని పాటలకు సాహిత్యం అందించిన సిరివెన్నెల గురించి ఎంత చెప్పిన తక్కువే, ఆనాటి సంస్కృతి, సంప్రదాయాలకు తగిన సాహిత్యం అందించటం  చాలా గొప్ప విషయం. నిర్మాణ విలువలు చాలా గొప్పగా వున్నాయి.

  చివరి మాట : బాలయ్య బాబు మరియు క్రిష్ చేసిన ఈ గొప్ప ప్రయత్నానికి మనం మొదట హ్యాట్సాఫ్ చెప్పాలి. ప్రతి తెలుగు వాడు చూడవలసిన గొప్ప సినిమాలో “గౌతమిపుత్ర శాతకర్ణి” సినిమా ఒకటి… జైయహో శాతకర్ణి

  గవ్వ కామెంట్ : తెలుగువాడు మీసం తిప్పే మహోన్నత చిత్రం

  గవ్వ రేటింగ్ : 3.25 / 5

  గమనిక : కేవలం ఇది మా అభిప్రాయం మాత్రమే

  Write by :PBN Chowdary    

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *