• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  శాతకర్ణి ఆడియో హక్కులను దక్కించుకున్న జె.మీడియా

  gautamiputra satakarni audio

  నందమూరి బాలకృష్ణ  నటిస్తున్న100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 2 వ శతాబ్దానికి చెందిన శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజీవ్ రెడ్డి, దర్శకుడు క్రిష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా విడుదల కంటే ముందే ప్రకంపనలు సృష్టిస్తుంది,ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి, అందుకు తగ్గట్లే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది,

  తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఆడియో హక్కులను జె.మీడియా చేజిక్కించుకుంది. ఈ సంస్థ శాతకర్ణి ఆడియో హక్కులను ఫ్యాన్సీ రేట్ చెల్లించి  కొనుగోలు చేసింది, ఆ సంస్థ అధినేత నరేంద్రరాజు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాత రాజీవ్ రెడ్డి నుండి అందుకు సంబంధించిన అగ్రిమెంట్ అందుకున్నాడు.గతంలో ఈ సంస్థ రజని కాంత్ నటించినా కబాలి ఆడియోను విడుదల చేసింది, అలాగే ‘జ్యో అచ్యుతానంద’ ఆడియో కూడా ఈ సంస్థ ద్వారానే విడుదలయ్యాయి.

  బాలకృష్ణ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు, దాదాపు 70 కోట్ల ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు, అందులో 15 కోట్ల దాక గ్రాఫిక్ వర్క్ కోసం కేటాయించినట్లు సమాచారం,దాదాపు 25 కంపెనీలు ఈ సినిమా కోసం పని చేస్తున్నాయి, వచ్చే నెల చివరి నాటికీ ఫస్ట్ కాపీ రెడీ అవ్వాలనే లక్ష్యంతో క్రిష్ బృందం కష్టపడుతుంది, అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *