• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    మహేష్ సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం

    mahesh-babu

    సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ దర్శకుడు మురగదాస్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెం 87 ఒక బిల్డింగ్ సెట్ లో జరుగుతుంది, అయితే ఈ రోజు ఉదయం అక్కడ కొంత మంది దీపావళి సంధర్బంగా టపాసులు కాల్చటంతో అవి సెట్ మీద పడటంతో అక్కడి టెంట్ మరియు ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయింది.

    ఈ ప్రమాదం సంభవించినప్పుడు అక్కడ ఎలాంటి షూటింగ్ ప్రారంభం కాకపోటంతో పెను ప్రమాదం తప్పింది, ఆ సమయంలో అక్కడ ఉన్న కొద్దీ మంది జూనియర్ ఆరిస్ట్స్ ప్రాణ భయంతో పరుగులు తీశారు, వెంటనే అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసింది. సినిమాకి వేసిన సెట్ దాదాపుగా కాలిపోవటంతో భారీ స్థాయిలోనే ఆస్తినష్టం కలిగే అవకాశం ఉంది, ప్రొడక్షన్స్ డిపార్ట్మెంట్ నుండి ప్రకటన వస్తే కానీ ఎంత ఆస్తి నష్టం కలిగిందో చెప్పలేము…

     

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *