• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మూవీ రివ్యూ : ఎక్కడికి పోతావు చిన్నవాడా

  ekkadiki-potavu-chinavada

  చిత్రం పేరు: ఎక్కడికి పోతావు చిన్నవాడా

  నటీనటులు: నిఖిల్‌.. హెబ్బా పటేల్‌.. నందితా శ్వేత.. అవికా గోర్‌.. సత్య.. వెన్నెల కిషోర్‌.. హర్ష.. రాజా రవీంద్ర.. తనికెళ్ల భరణి తదితరులు

  సంగీతం: శేఖర్‌ చంద్ర

  ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌

  ఎడిటింగ్: చోట కె.ప్రసాద్

  మాటలు: అబ్బూరి రవి

  నిర్మాత: పి.వి.రావు

  ప్రొడక్షన్ హౌస్: మేఘన ఆర్ట్స్‌

  రచన, దర్శకత్వం: విఐ ఆనంద్‌

  వైవిధ్యమైన సినిమాలు చేసే నవ తరం హీరోల్లో నిఖిల్ ముందు వరసలో ఉంటాడు, స్వామి రా..రా.. కార్తికేయ,సూర్య వర్సెస్ సూర్య లాంటి విభిన్నమైన సినిమాలు తీసిన నిఖిల్, ఆ తర్వాత వచ్చిన శంకరాభరణం సినిమాతో కొంచం వెక్కని తగ్గినా మాట వాస్తవమే, అయితే తాజాగా వి.ఐ ఆనంద్  దర్శకత్వంలో ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’..అనే సినిమాతో ఈ రోజే (18/11/2016) ప్రేక్షకుల ముందుకి వచ్చాడు మరి ఈ సినిమాతో నిఖిల్ మళ్ళీ విజయాల బాట పట్టాడో లేదో..చూద్దాం…

  మూల కథ: అర్జున్ (నిఖిల్) బాహుబలి సినిమాకి సంబంధించి గ్రాఫిక్ వర్క్ టీమ్ లో పనిచేస్తుంటాడు, అతని ఫ్రెండ్ వెన్నెల కిషోర్ కి దెయ్యం పట్టిందని అతనిని కేరళలోని మహిషాసురమర్థిని ఆలయానికి తీసుకోని పోతారు..అక్కడ అమల (హెబ్బా పటేల్‌) ని చూసి అర్జున్ ఇష్టపడతాడు,అయితే అమల అతనికి చెప్పకుండా ఆమె తన సొంతవూరికి వెళ్ళిపోతుంది,ఆమె కోసం అర్జున్ వాళ్ళ ఊరికి పోతాడు, అయితే నువ్వు ఎవరో నాకు తెలియదని,అలాగే నాపేరు అమల కాదని చెపుతుంది, ఇంతలోనే నేనే అమల అని ఒక అమ్మాయి వస్తుంది, ఈ  ట్రయాంగిల్ లవ్‌స్టోరీలోకి ఆయోషా (అవికాగోర్) వస్తుంది…అసలు అమల ఎవరు…? అమల అని వచ్చిన అమ్మాయి ఎవరు…? ఆయోషా కి వీళ్ళకి గల సంబంధం ఏంటి అనేది మిగిలిన కథ

  విశ్లేషణ: ఆత్మల మీద తెలుగులో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి, ఈ సినిమా కూడా ఆత్మల మీద రాసుకున్న కథే, ఇలాంటి  కథకి కొంచం కామెడీ జతచేసి సినిమాలు చేస్తున్నారు, అయితే దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఈ ఆత్మ కథకి కామెడీతో పాటుగా ప్రేమని జతచేసి సినిమాని తెరక్కించిన విధానం బాగుంది.

  ఈ సినిమాకి ప్రధాన హైలెట్ ఏమిటి అంటే ఇందులో వచ్చే ట్విస్ట్ లు, సినిమా ప్రారంభం అయినా కొద్దీ సేపటి తర్వాత నుండి వచ్చే ట్విస్ట్ చాలా ఆసక్తిగా ఉంటాయి, ఇక ఇంటర్వెల్ ముందుగా వచ్చే ట్విస్ట్ అయితే అదిరిపోయేలా వుంది, మొదటిభాగంలో వెన్నెల కిషోర్ తన కామెడీతో బాగానే నవ్విస్తాడు, అయితే నిఖిల్-హెబ్బా పటేల్ మధ్య వచ్చే సన్నివేశాలు కొంచం బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది. ద్వితీయార్థంలో మళ్ళీ వెన్నెల కిషోర్, సత్య కామెడీ ట్రాక్ సినిమా ఆహ్లదకరంగా సాగుతుంది.

  అయితే ఈ సినిమాలోని ట్విస్ట్ ప్రేక్షకులని ఆలోచనలో పడేసి, సినిమా మీద ఎక్కడ ఇంట్రస్ట్ తగ్గకుండా ఉండేలా చేస్తాయి, కానీ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మరి అసహజంగా అనిపిస్తాయి, మరి ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తాయి, అయితే ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలతో ఆల్మోస్ట్ ప్రేక్షకులకి సంతృప్తి దొరుకుతుంది, క్లైమాక్స్ ఇంకా కొంచం బాగా చిత్రీకరించి ఉంటే బాగుండేది.

  నటీనటులు: అర్జున్ గా నిఖిల్ నటన బాగానే వుంది, ఇది తనకి అలవాటు అయినా పాత్ర కావటంతో ఈజీగా నటించాడు,లుక్స్ పరంగా నిఖిల్ బాగానే ఆకట్టుకున్నాడు,ఈ సినిమాలో ఎక్కవుగా వేరియేషన్స్ చూపించే అవకాశం ఏమి మనోడికి రాలేదనే చెప్పాలి, హెబ్బా పటేల్ తన పాత్ర మేరకు నటించింది, ఇందులో వున్నా హీరోయిన్స్ లో ముఖ్యంగా చెప్పుకోవలసింది నందిత శ్వేతా గురించి ఆమె కి తెలుగులో మొదటి సినిమా అయినా చాలా బాగా నటించింది, గ్లామర్ విషయంలో అమ్ముడు కొంచం తక్కువే కానీ నటన పరంగా బాగా చేసింది, అవికాగోర్ కనిపించింది కొద్దీ నిమిషాలే అయినా బాగానే గుర్తువుండి పోతుంది, వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పవచ్చు, మొదటి నుండి చివరి దాక బాగానే నవ్వించాడు.

  సాంకేతిక వర్గం:ఒక దర్శకుడుగా వి.ఐ ఆనంద్ ఈ సినిమాని బాగానే తెరకెక్కించాడు, ట్విస్ట్ లను రివీల్ చేసే విధానం కానీ కామెడీ విషయంలో కానీ అయన బాగానే సక్సెస్ అయ్యాడు, అయితే క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలను సరిగ్గా డీల్ చేయలేకపోయాడు,అది ఒకటే మైనస్ గా చెప్పుకోవాలి. శేఖర్‌ చంద్ర అందించిన బ్యాక్ రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, అయితే మైండ్లో రిజిస్టర్ అయ్యే సాంగ్స్ ఏవి ఈ సినిమాలో లేవు, అలాగే సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి ప్రతి ఫేమ్ లో రిచ్ గా కనిపిస్తుంది, కేరళ అందాలని తన కెమెరాతో బాగానే ఒడిసిపట్టాడు, ఎడిటింగ్ పరంగా చుస్తే చాలా లోపాలు కనిపిస్తున్నాయి, లాజిక్ మిస్ అయినా మాటలు,సన్నివేశాలు వున్నాయి ఇంకా సినిమా నిడివి కొంచం తగ్గించి ఉంటే బాగుండేది.

  చివరి మాట: ఎక్కడికిపోతావు చిన్నవాడా అనే సినిమా బాగా థ్రిల్లింగ్ మూవీస్ ఇష్తే పడేవారికీ బాగా నచ్చుతుంది, మాములు ప్రేక్షకులు కూడా సినిమాని బాగా ఎంజాయ్ చేయవచ్చు ( కొన్ని లాజిక్ లు మీరు వదిలేస్తేనే), అయితే కరెన్సీ కష్టాలను తట్టుకొని ఈ చిన్నవాడు ఏ మేరకు పెరిగి పెద్దవాడు అవుతాడో చూడాలి.

  గవ్వ కామెంట్ : చిన్నవాడే అయినా చివరకి నిలబడతాడు.

  రేటింగ్: 3 /5

  గమనిక: ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *