• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  సంక్రాంతికి పక్కా ప్లాన్ తో వస్తున్న దిల్ రాజు..!!

  dilraju

  సంక్రాంతి బరి లో రెండు పెద్ద సినిమాలు ..చిరంజీవి 150వ సినిమా “ఖైధీ నెం 150”, బాలయ్య 100వ సినిమా “గౌతమి పుత్ర శాతకర్ణి”. ఈ సినిమాల పై అంచనాలు మామూలుగా లేవు. ఇంత భారీ రేంజ్ లో రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్న తరుణంలో దిల్ రాజు నిర్మించిన మీడియం సినిమా “శతమానం భవతి” ని సంక్రాంతి బరి లో నిలిపుతున్నాడు. దీని వెనక రాజు మాస్టర్ ప్లాన్ ఉందని తెలుస్తోంది.

  విషయంలో కి వెళ్తే జనవరి 11న ఖైదీ, 12న శాతకర్ణి రిలీజ్లు ఫిక్స్ అయిపోగా జనవరి 14న శతమానం భవతి రిలీజ్ అవుతుందని ముందే చెప్పేసాడు దిల్ రాజు. తెలంగాణలో అధిక శాతం థియేటర్లు రాజు చేతి లో ఉన్నాయన్న విషయం మనకి తెలిసిందే. రెండు పెద్ద సినిమాల రిలీజ్ లు ఉండగా, అన్ని థియేటర్లలో తన సినిమా రిలీజ్ చేస్కోవడం కుదరదు కాబట్టి కొన్ని థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు,కానీ..ఆ కొన్ని థియేటర్లలోకూడా ప్రధాన థియేటర్లనే తీసుకోవడం దిల్ రాజు ప్లాన్ గా కనిపిస్తుంది. అటు ఆంధ్రాలో కూడా తనకున్న నెట్వర్క్ తో మంచి థియేటర్లలో రిలీజ్ చేయనున్నాడట.

  మరోవైపు అమెరికా లో కొత్త సినిమా టికెట్ ధర 20 డాలర్లుకు తక్కువ ఉండదు. ఇక్కడ ‘శతమానం భవతి’ కి కూడా అంతే రేట్ పెట్టచ్చు కానీ అలా చేయకుండా దిల్ రాజు కొత్త ఫార్ములాని వాడుతున్నటు తెలుస్తుంది. ఈ సినిమా కి ఫస్ట్ వీకెండ్ లో 12 డాలర్ల టికెట్ ధర నిర్ణయించినట్టు సమాచారం. దీనివల్ల తక్కువ బడ్జెట్లో సినిమా చూద్దాం అనుకునే ప్రేక్షకుడు ఈ సినిమా వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగానే ఉండొచ్చు. పైగా ఈ సినిమా అమెరికా ప్రేక్షకుల టేస్ట్ కు దగ్గరగ ఉండడం మరో ప్లస్ పాయింట్ కానుంది.మొత్తానికి దిల్ రాజు మంచి మాస్టర్ ప్లాన్ తోనే రంగం లోకి దిగుతున్నాడు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *