• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???

  dilraju

  మొదట డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీ కి పరిచయమయ్యి నెమ్మదిగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి టాప్ ప్రొడ్యూసర్ గా అలాగే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా ఎదిగిపోయాడు మన దిల్ రాజు.ఒక సినిమాని దిల్ రాజు  నిర్మిస్తున్నాడు అంటే ఆ సినిమా గ్యారెంటీ హిట్ అని ముందే తేల్చేస్తారు ప్రేక్షకులు అంతలా ఎదిగిపోయాడు దిల్ రాజు.

  2017 లో దిల్ రాజు చేతిలో దాదాపు అరడజన్ సినిమాలు ఉన్నాయి.సినిమా సినిమాకి నెల లేదా నెలన్నర గ్యాప్ తో సినిమాలు రిలీజ్ అయ్యేలాగా చూసుకుంటున్నాడు దిల్ రాజు.ఈ ఏడాది మొదట రిలీజ్ అయ్యే సినిమా శర్వానంద్ నటించిన “శతమానం భవతి” తో తన న్యూ ఇయర్ ని మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమాని  జనవరి 14వ తారీఖున సీనియర్ హీరోలతో పోటీగా విడుదల చెయ్యనున్నారు.దీని తరువాత నాని నటించిన “నేను లోకల్” తో రానున్నాడు.వీటి తరువాత అల్లు అర్జున్ తో ఒక సినిమా వరుణ్ తేజ్ తో ఒక సినిమా అలాగే రవి తేజ సినిమా కూడా ఒకటి దిల్ రాజే నిర్మించనున్నాడు వీటితో పాటు ఇతర బాషల సినిమాలు తెలుగు లోకి అనువాదం అయ్యే సినిమాలు కూడా ఉన్నాయి.

  ఈ సినిమాలన్నీ ఇదే ఏడాదిలో విడుదల కానున్నాయి.జనవరి నుండి స్టార్ట్ చేసి డిసెంబర్ వరకు నెల లేదా నెలన్నర గ్యాప్ తో ఒక్కో సినిమా విడుదల చేయనున్నాడు అన్నమాట మన దిల్ రాజు.ఇవ్వన్నీ కలుపుకొని ఈ కొత్త ఏడాది లో దిల్ రాజు దాదాపు 140 కోట్లు వరకు బిసినెస్ చేయనున్నాడు అని తెలుస్తుంది.ఇలా అయితే ఈ ఏడాది దిల్ రాజుకి రాసి ఇచ్చేయొచ్చు గా…

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *