• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ‘ధృవ’ మొదటి టార్గెట్ హైదరాబాద్

  R$am-charan-rakul-preet-singh

  టార్గెట్ ఏమిటో మొదట ఫిక్స్ చేసుకోవాలి అంటూ టీజర్ తో కనిపించిన రామ్ చరణ్ తాజాగా తన టార్గెట్ ని ఫిక్స్ చేసుకొని మొన్న ట్రైలర్ రూపంలో దర్శనమిచ్చాడు,అందులో రామ్ చరణ్ ని చూసి మెగా అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు, అంత కొత్తగా వున్నాడు చెర్రీ తన  లుక్స్ లో కాదు తన పర్ఫామెన్స్ లోను చాలా మార్పులు చేసుకొని ఈ సినిమాలో నటించాడనే విషయం తెలిసిపోతుంది.

  ఈ సినిమా డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు, ఈ సినిమా యొక్క ప్రీమియర్ షోలను చిత్ర యూనిట్ మొత్తం కలిసి యూఎస్ లో చూడబోతున్నారు,అయితే విడుదలకి ముందే ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ని డిసెంబర్ 4న భారీ స్థాయిలో నిర్వహించాలి మొన్న ట్రైలర్ ఫంక్షన్ లో ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ చెప్పటం జరిగింది, ఇందు కోసం మొదట వైజాగ్, తిరుపతి, విజయవాడ లాంటి నగరాలను ఎంచుకున్నారు.

  అయితే ఫైనల్ గా హైదరాబాద్ ని ఇందుకు వేదిక చేసుకున్నారని తెలుస్తుంది, ఆ తర్వాత తిరుపతి, విజయవాడ లో కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం, హైదరాబాద్ లో ఫంక్షన్ జరిగే ప్రదేశం ఇందులో పాల్గొనే ముఖ్య అతిధుల గురించి పూర్తి వివరాలు రెండు మూడు రోజుల్లో తెలిసే అవకాశం వుంది, సో మెగా అభిమానులు రెడీ అయిపోండి.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *