• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మరో గట్టి షాక్ ఇచ్చిన ధోని.ఓడిఐ,టి20 కెప్టెన్ గా గుడ్ బై..

  dhoni

  మహేంద్ర సింగ్ ధోని ఇది ఒట్టి పేరు మాత్రమే కాదు ఇది ఒక బ్రాండ్ అని చెప్పిన తప్పులేదు అనుకుంట.మన ఇండియన్ క్రికెట్ టీం ఏపుణ్యం చేసుకుందో గాని ఇలాంటి కెప్టెన్ ని పొందింది.2004 లో క్రికెట్ టీం లోకి ఎంట్రీ ఇచ్చిన ధోని తన ఆట తీరుతో ప్రతీ ఒక్క క్రికెట్ అభిమానిని అలరించాడు .

  2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి కెప్టెన్సీ బాధ్యతలను తన భుజాలపైన వేసుకొని తిరుగులేని రికార్డ్స్ ని సొంతం చేసుకున్నాడు మనోడు. కపిల్ దేవ్ తరువాత మళ్ళీ ధోని సారథ్యంలోనే మనకి 28 సంవత్సరాల తరువాత వరల్డ్ కప్ వచ్చింది.అలాగే మొట్టమెదటి టి20 వరల్డ్ కప్ కూడా మన ఇండియాకి తెచ్చి పెట్టాడు ధోని. ఇప్పటి దాకా ఒక్క ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ కూడా లేని ఇండియాకి ఈ ట్రోఫీ వచ్చింది ధోని సారథ్యంలోనే. 40 ఏళ్ళ తరువాత టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాని వైట్ వాష్ చేసిన ఘనత కూడా ధోనీకే దక్కింది.

  వరల్డ్ లోనే బెస్ట్ ఫినిషర్ గా పేరుతెచ్చుకున్న ధోని,తనదైన శైలిలో కొట్టే హెలికాప్టర్ షాట్ కి విపరీతమైన ఫాన్స్ ఉన్నారు. మ్యాచ్ ఇక చేతుల నుండి జారిపోయింది అనుకున్న టైం లో ధోని ఉంటే ఇక చాలు మ్యాచ్ మనదే అన్న రేంజ్ లో ఆడి,మనందరినీ తన స్టైల్ అఫ్ బ్యాటింగ్ తో బాగా అలరించాడు. ఒక కెప్టెన్ గానే కాకుండా వికెట్ కీపర్ గా కూడా తన ప్రతిభను కనపరచి ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్నాడు.

  2014 డిసెంబర్ 30న టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కి సడన్ గా గుడ్ బై చెప్పేసి క్రికెట్ అభిమానులకి షాక్ ఇచ్చాడు,అలాగే ఇప్పుడు ‘వన్డే’ లకి మరియు ‘టీ20’ల కెప్టెన్సీ కి కూడా ధోని గుడ్ బై చెప్పేసి మరో సారి తన అభిమానులకు,క్రికెట్ అభిమానులకు గట్టి షాక్ ఇచ్చాడు.మళ్ళీ ఇలాంటి కెప్టెన్ ని మనం ఎన్నటికీ చూస్తామో అసలు చూడగలమో లేదో వేచి చూడాలి..

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *