• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  చెత్త రాజకీయాలు చేయకండి- సీఎం శివరాజ్ చౌహన్

  cm-chauhan-consoles-family-of-head-guard-died-in-jailbreak-incident

  మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారు. సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ పై చెత్త రాజకీయాలు చేయవద్దంటూ హెచ్చరించారు.

  నిన్న తెల్లవారు జామున సిమి ఉగ్రవాదులు భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుంటూ రామసింగ్ యాదవ్ అనే గార్డ్ ను గొంతు కోసి చంపేశారు. సిమి ఉగ్రవాదులు తప్పించుకున్న కొన్ని గంటలకే ఎన్ కౌంటర్ జరిగింది.

  రామసింగ్ యాదవ్ అంత్యక్రియలకు మధ్యప్రదేశ్ సీఎం హాజరయ్యారు. అంత్యక్రియలు ఐపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ విపక్షాల మీద విరుచుపడ్డారు. ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, సిమి ఉగ్రవాదులు చనిపోయారని సానుభూతి చూపిస్తున్నారు, కానీ పోలీస్ గార్డ్  త్యాగం గురించీ, గార్డ్ కుటుంబసభ్యుల బాధ గురించీ ఎవరూ మాట్లాడట్లేదు అని వాపోయారు. గార్డ్ రామసింగ్ కుటుంబసభ్యలకు సానుభూతి తెలియజేస్తూ, 15 లక్షల ఎక్సగ్రేసియా ప్రకటించారు. కాగా, గార్డ్ రామసింగ్ కూతురి పెళ్లి ఈ డిసెంబర్ లో జరగాల్సి ఉంది.

  ఈ ఎన్ కౌంటర్ ఘటన పై సమగ్ర విచారణ జరపాలనీ, అత్యంత కట్టుదిట్టమైన జైలు నుంచి ఎలా తప్పించుకోగలిగారని నివేదిక సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్ట్ ను కోరారు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. టెర్రరిస్ట్ లను సజీవంగా పట్టుకొని విచారిస్తే, జైలులోని లోపాలు బయట పడతాయని పోలీసులు భయపడి కాల్చి చంపారని ఆరోపంచారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *