• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు….

  chandrababu-naidu-attended-world-economic-stage-meeting-in-delhi

  అభివృద్దే భవిష్యత్తు అని పదే పదే చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రము విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందొ అందరికి తెలిసిన విషయమే. ఇక అభివృద్ధి జరగాలంటే ఆర్థికంగా మరియు పెట్టుబడులు ఎలా రావాలి అనే అంశంపై ఢిల్లీ లో జరిగిన మీటింగ్ లో చర్చించారు చంద్రబాబు నాయుడు.

  ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం నూతన అభివృద్ధి మంత్రంగా మారిందని చంద్రబాబు అన్నారు. ఈ నమూనా మెరుగైన ఫలితాలను ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్బంగా తాను అభివృద్ధి చేసిన హైదరాబాద్ సైబరాబాద్ గురించి గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు కొత్త రాష్ట్రము అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. అందుకోసం రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారని గుర్తుచేశారు రాష్ట్రానికి కృష్ణా గోదావరి నదులు అత్యంత కీలకం అన్నారు. తొలి త్రైమాసికం లో 22.5 శాతం వ్యవసాయ వృద్ధి సాధించామని తెలిపారు.

  ఇంకా మాట్లాడుతూ.. తాను చేసే అభివృద్ధికి కొందరు అడ్డు తగులుతున్నారని గ్రౌండ్ లెవెల్ ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. ఇలాంటివి మధ్యలో అడ్డుగా వస్తుంటాయి అని కానీ మన పని మనం చేసుకుంటూ పోతాము అని సెలవిచ్చారు. ఇంకా దుబాయ్ గురించి చెబుతూ.. వాళ్ళు ఎడారిని స్వర్గంలాగా చేసుకున్నారు, మనం కూడా అలా ముందుకు వెళ్లాలని తెలిపారు.

  సదస్సు తర్వాత చంద్రబాబు నాయుడు పలువురు పారిశ్రామిక వేత్తలతో మీటింగ్ లో పాల్గొన్నారు. వివిధ పెట్టుబడుల  అవకాశాల గురించి చర్చినట్లు తెలిసింది.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *