• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  లేని ప్యాకేజీ రాష్ట్ర ప్రజలకెలా చూపుతారో?

  విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పొందుపర్చకపోవడం వల్లే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు వచ్చాయని, ఈ లోటును పూడ్చేందుకే తమ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని బీజేపీ నేతలు అంటున్నారు. ప్యాకేజీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏపీ వ్యాప్తంగా సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ప్రకటించారు. ఇంతకీ ఏ ప్యాకేజీ గురించి వీరంతా మాట్లాడుతున్నట్లో… కేంద్రం భారీ ప్యాకేజీ ఇచ్చిందని బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు, ఏపీ సీఎంతో సహా ఊదరగొడుతున్నారు.

  నిజానికి ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా ప్రత్యేక ప్యాకేజీ అనే మాటే లేదు. ఆర్థి శాఖ విడుదల చేసిన ప్రకటనలోని అంశాలు, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలకు తేడా లేదని ఇంటర్నెట్లో ఆ ప్రకటన చదివిన వారికి ఎవరికైనా తెలిసిపోతుంది. కనీసం కేంద్రం చెప్పేవాటికి చట్టబద్ధత కల్పించాలని చంద్రబాబు అడిగితే కూడా అంతా విభజన చట్టంలోనే ఉందంటూ అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చేవే ఏపీకి ఇస్తూ స్పెషల్ ప్యాకేజీ అని మభ్యపెడుతున్నట్లు ఆర్థికశాఖ ప్రకటనతో స్పష్టమైపోయింది. విభజన చట్టంలోని అంశాలు, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏపీకి ఇచ్చిన హామీలు అమలవుతాయని కేంద్రం జారీ చేసిన పత్రంలో స్పష్టంగా ఉంది.
  ఆర్థిక శాఖ వెబ్ సైట్ లో జీఓలు ఆర్డర్లూ చూసేందుకు రెడీగా ఉన్నాయి. మరి బీజేపీ టీడీపీ నేతలు రాష్టమంతా తిరిగి ఎవరిని ఎలా మభ్యపెడతారో మరి?

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *