• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఓవర్సీస్ లో ఖైదీ కి భారీ ఝలక్ ..???

  usa

  “ఖైదీ నెం150” సినిమా రిలీజ్ అయ్యి నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నిటిని తుడిచి పెటేసిందని తెలుస్తుంది. యూఎస్ లో ఒక్క ప్రీమియర్స్ తోనే 1.25 మిలియన్ డాలర్స్ ని సంపాదించి రికార్డ్స్ సృష్టించిందని కూడా మనకు తెలుసు.అలాగే మిగతా ఏరియాలలో కూడా చిరు తన స్టామినాని మరో సారి గుర్తుచేశాడు.

  కాగా యూఎస్ లో ఖైదీ కి గట్టి షాక్ తగిలేలా ఉందని సమాచారం. జర్మనీ కి సంబంధించిన ఒక సంస్థ ఒక యాప్ ని క్రియేట్ చేసింది. ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే కేవలం 2 డాలర్స్ కే ఖైదీ సినిమా టికెట్ ఇస్తామని చెప్పటం తో దాదాపు 40వేల మంది ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఖైదీ సినిమాని వీక్షించారంట. అంతే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ కి ఒక్కో టికెట్ మీద 9.25 డాలర్స్ మాత్రమే చెల్లిస్తాం అని కూడా చెప్పారంట. అంటే ఈ సినిమా డిస్ట్రబ్యూషన్స్ రైట్స్ తీసుకున్నవాళ్ళకి ఒక్కో టికెట్ మీద 15.75 డాలర్స్ నష్టం ఉండబోతుంది. కానీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం తమకి 25 డాలర్స్ చెల్లిచాలి లేకపోతే కేస్ ఫైల్ చేస్తాం అని చెప్తున్నారని సమాచారం.

  ఒకవేళ టికెట్ కి యాప్ వాళ్ళు అనుకున్నట్టు 9.25 డాలర్స్ చెల్లిస్తే, డిస్ట్రిబ్యూటర్స్ భారీ లాస్ చవిచూడాల్సి వస్తుంది.అంతే కాకుండా ఖైదీ రికార్డ్స్ ని కనుమరుగైపోతాయి. దీంతో ఖైదీ సినిమా ప్రీమియర్స్ కలెక్షన్స్ 5 లేదా 6 లక్షల డాలర్స్ కన్నా ఎక్కువ ఉండదని కూడా చెపుతున్నారు. చూద్దాం మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో…

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *