• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మూవీ రివ్యూ: బేతాళుడు

  bethaludu-movie-review-rating-copy

  సినిమా పేరు: బేతాళుడు

  ప్రధాన తారాగణం: విజయ్ ఆంటోనీ, అరుంధ‌తి నాయర్‌, చారుహాస‌న్‌, వై.జి.మ‌హేంద్ర‌, కిట్టి, మీరాకృష్ణ‌న్‌, మురుగ‌దాస్ త‌దితరులు

  సంగీతం: విజయ్ అంటోనీ

  ఛాయాగ్రహణం: ప్ర‌దీప్ క‌లిపుర‌య‌త్‌

  ఎడిటింగ్: వీర సెంథిల్ రాజ్

  మాటలు పాటలు : భాష్య శ్రీ

  నిర్మాత: ఫాతిమా విజయ్‌ ఆంటోనీ, మల్కాపురం శివకుమార్‌

  ప్రొడక్షన్ హౌస్ :  మాసన్‌ రుషి ఎంటర్‌ ప్రైజెస్‌, విన్‌ విన్‌ విన్‌ క్రియేషన్స్

  డైరెక్టర్ : ప్రదీప్ కృష్ణమూర్తి

  విజయ్ ఆంటోనీ విభిన్నమైన కథలతో ప్రయాణం సాగించే నటుడు, గతంలో ‘నకిలీ, డా. సలీమ్, బిచ్చగాడు’ లాంటి విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకున్నాడు, బిచ్చగాడు సినిమా అయితే తెలుగునాట ప్రభంజనం సృస్టించిదనే చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఏకంగా 100  రోజులు ఆడి రికార్డ్ నెలకొల్పింది. తాజాగా విజయ్ ఆంటోనీ బేతాళుడనే సినిమాతో ఈ రోజు (డిసెంబర్ 1) ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.మరి ఈ సినిమా బిచ్చగాడి ఫామ్ ను కంటిన్యూ చేసిందో లేదో చూద్దాం..

  మూలకథ : దినేష్‌ (విజయ్‌ ఆంటోనీ) ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తుంటాడు,అనాథ అయిన ఐశ్వ‌ర్య‌(అరుంధ‌తిరాయ్‌)ను పెళ్లి చేసుకుని హ్య‌పీగా జీవితం గడుపుతుంటాడు,అయితే పెళ్లి అయినా కొన్ని రోజులకి ఎవరిదో ఒక గొంతు వినిపిస్తూ తనని చనిపొమ్మని,జయలక్ష్మి ని చంపమని ప్రేరేపిస్తునట్లు అనిపిస్తుంది , మొదటిలో ఏదో నార్మల్ విషయం అనుకున్న కానీ అది ఇంకా తీవ్ర రూపం దాల్చటంతో ఒక మానసిక వైద్యుడి దగ్గరకి వెళ్ళతాడు,. అతను హీరోని హిప్నాటిజం చేసి అతని పూర్వ జన్మ విషయాలని తెలుసుకుంటాడు, అందులో జయలక్ష్మి గురించి దినేష్ చెపుతాడు..అసలు జయలక్ష్మి ఎవరు..? ఆమెకి దినేష్ కి గల సంబంధం ఏమిటి..? అసలు దినేష్ భార్య ఐశ్వ‌ర్య‌ కి జయలక్ష్మి కి లింక్ ఏమిటి…? చివరి ఈ సమస్య నుండి దినేష్ ఎలా బయట పడ్డాడనేది మిగిలిన కథ.

  విశ్లేషణ: గత సినిమాల మాదిరే  విజయ్ ఆంటోనీ కూడా ఈ సారి ఒక కొత్త కధతోనే మన ముందుకి వచ్చాడు,అయితే ఈ కథని తెరకెక్కించడంలో దర్శకుడు కొంచం తడబడిన మాట వాస్తవమే. మొదటి భాగంలో హీరో అతనికి ఎదురైయే సమస్యని చూపిస్తూ సినిమాని నడిపించాడు, హీరో మానసిక వైద్యుడిని సంప్రదించటం ఆ తర్వాత జరిగే పరిణామాలు, జయలక్ష్మి కోసం వేడుకులాటడం వంటివి సినిమా మీద ఎక్కడ ఆసక్తి తగ్గకుండా చేస్తాయి.

  అయితే సెకండ్ ఆఫ్ కి వచ్చేసరికి హీరో గతజన్మ కి సంబంధించిన స్టోరీ లోకి సినిమాని తీసుకోని వెళ్లటంతో కొంచం అసహనం కలుగుతుంది, దానికి తోడు ఈ సినిమాలో ఎక్కడ కామెడీ అనేది లేకపోవటం కూడా ఒక కారణమే, సెకండ్ ఆఫ్ మధ్య దాక ఈ సినిమాలో వుండే ఉత్కంఠని దర్శకుడు బాగానే క్యారీ చేసుకుంటూ వచ్చాడు, చివరిలో ఆ పాయింట్స్ అన్ని రివీల్ అయినా తర్వాత కూడా దర్శకుడు సినిమాని పూర్తి చేయకుండా అలాగే కంటిన్యూ చేయటంతో ఆడియెన్స్ కి ఏదో సాగతీత లాగా అనిపిస్తుంది.

  నటీనటులు: ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ నటన బాగుంటుంది. ఈ సినిమా చూస్తే పాత్రకి తగ్గట్లు ఆయన నటిస్తున్నాడా లేక ఆయనకి తగిన పాత్రలే సెలెక్ట్ చేసుకొని నటిస్తున్నాడా అనిపిస్తుంది, గతంలో వచ్చిన విజయ్ ఆంటోనీ సినిమాలని పరిశీలిస్తే ఈ విషయం మనకి తెలుస్తుంది,. ఇక ఈ సినిమాలో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో విజయ్ ఆంటోనీ చాలా బాగా నటించి మెప్పించాడు, అలాగే హీరోయిన్ అరుంధతి నాయర్ నటన పరంగా చక్కగా నటించింది, సెకండ్ ఆఫ్ లో కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది.

  సాంకేతిక వర్గం: ఈ సినిమా దర్శకుడు ప్రదీప్ కథ రాసుకున్నపుడు దానిని చెప్పేటప్పుడు బాగానే చెప్పి ఉంటాడు, దానికి తెర మీద చూపించే విధానంలో ఆయన సక్సెస్ కాలేకపోయాడు, ఒక పక్క ఫాంటసీ స్టోరీ చెపుతూ,మరో పక్క డ్రగ్స్ అనే కాన్సెప్ట్ ని తెర మీదకి తీసుకోని రావటంతో ఈ రెడింటిని సరిగ్గా డీల్ చేయలేకపోయాడు. ఇక ఈ సినిమాలో పాటలు ఏమి అంతగా ఆకట్టుకోవు, కానీ బ్యా గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి ప్రాణం అనే చెప్పాలి, విజయ్ ఆంటోనీ అందించిన మ్యూజిక్ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకోని వెళ్ళింది,అలాగే ప్రదీప్ క‌లిపుర‌య‌త్‌ ఛాయాగ్రహణం పర్వాలేదనిపిస్తుంది, చివర్లో సినిమా యొక్క నిడివి విషయంలో ఎడిటింగ్ పరంగా కొంచం కత్తెర పదును చూపించి ఉంటే బాగుండేది.

  చివరి మాట: కథ కొత్తదే అయినా, విజయ్ ఆంటోనీ నటన పరంగా బాగానే నటించిన, సినిమా విషయానికి వచ్చేసరికి కొంచం ఇబ్బంది అయితే వుంది. బిచ్చగాడు సినిమా అనుకోని మాత్రం థియేటర్స్ కి వెళ్ళకండి.సాధారణ సినిమాలుగా భావించి వెళ్ళితే హాయిగా చూసి రావచ్చు.

  గవ్వ కామెంట్స్ : పర్వాలేదనిపించిన బేతాళుడు

  రేటింగ్ : 2.5/ 5

  గమనిక: ఇది కేవలం మా అభిప్రాయం మాత్రమే..

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *