• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  కరతాళ ధ్వనులలో బాలయ్య ఫ్యామిలీ..!!

  family

  నందమూరి బాలకృష్ణ నటించిన తన 100వ సినిమా “గౌతమి పుత్ర శాతకర్ణి” 12న విడుదల అవ్వటానికి సిద్ధంగా ఉందన్న విషయం మనకి తెలిసిందే.నందమూరి ఫాన్స్ ఈ సినిమా కోసం తమ అభిమాన హీరోని ఇలాంటి హిస్టారికల్ సినిమాలో సిల్వర్ స్క్రీన్ మీద చూడటానికి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు.

  అయితే మరో రోజు గ్యాప్ తోనే ఈ సినిమా విడుదల కానుంది కాబట్టి బాలయ్య బాబు తన ఫ్యామిలీ కోసం ఈ సినిమాని రామానాయుడు స్టూడియోస్ లో ప్రత్యేక స్క్రీనింగ్ ని ఏర్పాటు చేయించాడు. బాలకృష్ణతో పాటు.. వసుంధర.. నారా లోకేష్.. బ్రాహ్మణి.. తేజస్విని.. భరత్.. సాయి కొర్రపాటి మరికొందరు ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి హాజరయ్యారు. సినిమా పూర్తయ్యాక అందరూ కరతాళ ధ్వనులతో నిండిపోయారంట. శాతకర్ణి గా బాలయ్య నటన అమోఘం అని యుద్ధ సన్నివేశాలలో బాలయ్య బాబు చాలా బాగా నటించాడని సినిమాకే ఇవి సగం హైలెట్ అని తెలియచేస్తున్నారు. అలాగే వశిష్టీ దేవిగా శ్రియ నటన శాతకర్ణి తల్లి పాత్రలో నటించిన, హేమ మాలిని నటన సినిమాని మరో మెట్టు పైకి తీసుకెళ్లనుంది అని సమాచారం.

  ఇలాంటి ప్రతిష్టాత్మకమైన హిస్టారికల్ సినిమాని కేవలం 79 రోజుల్లోనే తెరకెక్కించిన క్రిష్ కి ఈ సినిమా ఒక మైలురాయిలాగా నిలిచిపోనుందంట. ముఖ్యంగా బాలయ్య బాబు తన వందో సినిమాగా సరిగ్గా సరిపోయే సినిమాలో నటించాడని సినీ వర్గాలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *