• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  అభిమానులకి లేఖ రాసిన నటసింహం

  balakrishna-worte-a-letter-to-his-fans-wishing-them-dasara-and-deepavali

  అభిమానులని దేవుళ్లుగా భావించే నటీనటులలో బాలయ్య బాబు ఒకరు విజయదశమి సంధర్బంగా బాలకృష్ణ అభిమానులకి తన తరుపున లేఖ రాశారు, తన ఆఫీస్ లెటర్ హెడ్ ద్వారా విడుదల చేసిన లేఖలో..

  అభిమానులందరికీ..విజయదశమి,దీపావళి శుభాకాంక్షలు మీరు నాకు అభిమానులు మాత్రమే కాదు..నన్ను నిలబెట్టిన ఆత్మాభిమానులు..నా తండ్రి, మనందరికీ దైవసమానులైన స్వర్గీయ నందమూరి రామారావు గారు  నాకు జీవితాన్నిచ్చింది నా కోసం కాదు మీ కోసం…

  తలిదండ్రుల ఋణమైన మరో జన్మలో తీరుతుంది ఏమో  తెలియదు,  అభిమానుల ఋణం తీర్చే జన్మని ఏ దేవుడు ఇవ్వలేదు.అమ్మవారి ఆశీస్సులతో మీరందరు కలకాలం బాగుండాలి, మీరు,మీతో ఉన్నవాళ్లు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు  అందరూ ఆయురారోఖ్యలతో ఆనందంగా జీవించాలి..

  అమ్మ నవమాసాలు మోసి ప్రాణం పోస్తుంది.. అమ్మలగమ్మ అమ్మ నవరాత్రులలో ఈ సృష్టికి ప్రాణం పోస్తుంది.. ప్రతి తల్లీ ఓ కొత్త సృష్టిని మోస్తుంది..ఆ నవమాసాలకు ప్రతిరూపాలే ఈ నవరాత్రులు.. బ్రహ్మసృష్టిని అమ్మ ప్రసవించిన ఆ బ్రహ్మోత్సవమే విజయదశమి.. కడుపారా కన్న మన మాతృమూర్తులే మన పాలిటి ఆదిపరాశక్తులు.. అమ్మను సేవించటమే అమ్మవారి పూజ.. అమ్మలు బాగుండాలి.. అందరూ బాగుండాలి..

  తల్లి గొప్పతనాన్ని చాటిచెప్పిన “గౌతమీపుత్ర శాతకర్ణి” గా, భరతఖండ కీర్తి పతాక భూమి నలుచెరగులా ఎగురవేసిన శకపురుషుడిగా, జాతికి ఉగాదిని అందించిన యుగపురుషుడిగా.. క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నా నూరవ చిత్రం “గౌతమీపుత్ర శాతకర్ణి” ని మీకు సంక్రాంతి కానుకగా అందిస్తున్నానని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇలాగే కలకాలం మీ ఆధారాభిమానులు కోరుతూ, మన జీవితమంతా విజయదశమి కావాలనీ, క్షణాల వరుసలన్నీ దీపాల కాంతులై దినమొక దీపావళి జరగాలనీ మనసారా ఆశిస్తూ .. అని ముగించారు…

  14627694_1041817625930765_358664963_n

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *