• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  బ్రెస్ట్ కాన్సర్ అవగాహనా కార్యక్రమం..

  balakrishna-speaks-about-breast-cancer-awareness-at-kbr-park

  హైదరాబాద్ కేబిఆర్ పార్కులో ‘పింక్ రిబ్బన్ పార్క్’ అవగాహనా కార్యక్రమం జరిగింది. మహిళల్లో బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కల్పించేందుకు బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహనా సదస్సులో సినీ నటుడు బాలకృష్ణ, మంచు లక్ష్మి, తెలంగాణ ఎంపీ కవిత హాజరైయ్యారు.

  మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ముందే గుర్తించి సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే కాన్సర్ ని జయించవచ్చన్నారు. ఇక బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ ఈ కాన్సర్ వల్ల మరణిస్తుందన్నారు. అలాగే ఏటా లక్షా యాబై వేల మహిళలు బ్రెస్ట్ కాన్సర్ బారిన పడుతున్నారు, మహిళ ఈ కాన్సర్ మహమ్మారిని ముందే గుర్తించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

  బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ పింక్ వాక్ ద్వారా మహిళల్లో అవగాహన పెరిగి కాన్సర్ నుంచి బయటపడేందుకు ఉపయోగపడుతుందన్నారు తెలంగాణ ఎంపీ కవిత. సినీ నటులు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే ప్రజల్లోకి ఎక్కువ వెళ్తుందన్నారు. ఇంకా కవిత మాట్లాడుతూ.. మహిళలు ఇంట్లో పనే కాకుండా, ఒకసారి తమ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలన్నారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *