• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఆసియా యూత్ ఐకాన్ గా రామ్ చరణ్

  ram-cahran youth icon

  కొత్త కొత్త డ్రెస్ లతో సరికొత్త ఫ్యాషన్లతో ప్రేక్షకులని అలరించటం కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు ముందు వుంటారు, ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు ఇందులో చాలా స్పీడ్ గా వుంటారు, అయితే ఈ మధ్య మన తెలుగు హీరోలు కూడా ఏమి తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు, తెలుగులో స్టయిలిష్ లుక్ అనేది ఎప్పటి నుండో ఉన్నకాని, ఈ మధ్య రానా తోనే బాగా పాపులర్ అయ్యిందని చెప్పాలి, హాలీవుడ్, బాలీవుడ్ హీరోలకి ఏమి తక్కువ కాకుండా రానా వేదికల మీద కనిపిస్తాడు.

  తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా సరికొత్త డ్రెసింగ్ స్టైల్ లో కనిపించాడు, దుబాయ్ వేదికగా జరిగిన ఆసియావిజన్-2016 అవార్డ్స్ ఫంక్షన్స్ కి బ్లాక్ కలర్ కుర్తా-పైజామా ధరించి దాని మీద బ్లాక్ కోటు వేసుకొని హాజరయ్యారు, యూత్ ఐకాన్ ఆసియావిజన్-2016  అవార్డు అందుకున్న రామ్ చరణ్ నిజంగానే యూత్ ఐకాన్ గా వున్నాడని పలువురు ప్రశంసించారు.

  ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ విడులా అవటానికి సిద్ధంగా వుంది, మరో పక్క రామ్ చరణ్ నిర్మాతగా వ్యవరిస్తున్న చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెం.150’ సినిమా నిర్మాణ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు, ఈ రెండు సినిమాలు కూడా మెగా ఫ్యామిలీకి చాలా ప్రెస్టీజియస్ మూవీస్ అనటంలో ఎలాంటి సందేహం లేదు, రిలీజ్ అయినా తర్వాత ఇదే విధంగా వాళ్ళ కెరీర్ లో స్పెషల్ మూవీస్ గా నిలిచిపోతాయో లేదో చూడాలి…

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *