• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  అమరావతి మరో ముందడుగు..

  arun-jaitli-to-meet-chandrababu-naidu-to-discuss-railway-zone-and-pending-projects

  ఏపీ రాజధాని నిర్మాణంలో ఇవాళ రోడ్ల విషయం గురించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు ప్రభుత్వం. అమరావతిలో మరో నిర్మాణానికి ఇవాళ పునాదిరాయి పడబోతోంది. ఈ రోజు ప్రభుత్వ భవనాలు, రోడ్లకు శంకుస్థాపన చేయబోతున్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.

  హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్న అరుణ్ జైట్లీకి ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు ఆహ్వానం పలకనున్నారు. ఆ తర్వాత విజయవాడలో బీజేపీ కార్యకర్తలతో జైట్లీ సమావేశం అవుతారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశముంటుంది. ఈ సందర్బంగా ఏపీ ప్యాకేజీకి చట్టబద్దత, రైల్వే జోన్, ఇంకా పెండింగ్ ప్రోజెక్టులపై చర్చజరగచ్చు అని సమాచారం. ఆ తర్వాత సాయంత్రం 3 గం.లకు ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాలు, రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో జైట్లీ పాల్గొంటారు.

  అమరావతిలోని లింగాయపాలెంలో 900 ఎకరాల స్థలంలో భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 5600 కోట్ల అంచనా వ్యయంతో భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసారు. సెక్రటేరియట్, శాసన సభా మండలి భవనాలు, రాజభవన్, సీఎం నివాసం, ప్రభుత్వ విభాగ అధిపతుల కార్యాలయాలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగుల నివాస గృహాలను ఇక్కడ నిర్మించనున్నారు. 2018 డిసెంబర్ లోగా వీటిని పూర్తి చేయాలనీ నిర్ణయం తీసుకోబోతున్నారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *