• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  మూవీ రివ్యూ&రేటింగ్: అప్పట్లో ఒకడుండేవాడు

  appatlo-okadundevadu movie review rating

  మూవీ రివ్యూ&రేటింగ్: అప్పట్లో ఒకడుండేవాడు

  ప్రధాన తారాగణం :నారా రోహిత్,శ్రీ విష్ణు – తన్య హోప్ – బ్రహ్మాజీ – రాజీవ్ కనకాల, ప్రభాస్ శీను,అజయ్ ,సత్యదేవ్,సత్యప్రకాష్,రవి వర్మ,రాజ్ మాదిరాజు,మానస తదితరులు

  సంగీతం : సాయికార్తీక్

  నేపథ్య సంగీతం: సురేష్ బొబ్బిలి

  ఛాయాగ్రహణం : నవీన్ యాదవ్

  ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు

  నిర్మాత : కృష్ణ విజయ్ – ప్రశాంతి

  కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సాగర్ చంద్ర

  వరస సినిమాలు చేస్తూ యమా స్పీడ్ గా దూసుకొనిపోతున్న యువ కధానాయకుడు నారా రోహిత్, అలాగే సినిమాలో చిన్న చిన్న రోల్స్ చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీ విష్ణు, ‘అయ్యారే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా సాగర్ చంద్ర వీళ్ళందరూ కలిసి తీసిన సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. 1990 లో జరిగే కథగా తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకి ముందే మంచి క్రేజ్ ఏర్పర్చుకుంది. ఈ రోజే (30) విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులని ఎంత మేర ఆకట్టుకుందో చూద్దాం.

  మూల కథ: గొప్ప క్రికెటర్ కావాలని కలలు కనే యువకుడు రైల్వే రాజు (శ్రీ విష్ణు) అందుకోసమే నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. అయితే అతని జీవితంలోకి అనుకోకుండా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ ఖాన్ (నారా రోహిత్ ) వస్తాడు.అతని వలన రైల్వే రాజు జీవితం ఒక్క సారిగా మారిపోతుంది.

  నక్సల్‌ ముఠాని అంతమొదించానికి కావలసిన సమాచారం రైల్వే రాజు దగ్గర ఉందన్న సమాచారంతో ఇంతియాజ్ ఖాన్ అతనిని కస్టడీలోకి తీసుకోని విచారిస్తాడు, అయితే అనుకోని విధంగా రైల్వే రాజు ఒక హత్య కేసులో చిక్కుకుంటాడు. అసలు ఇంతియాజ్ ఖాన్ రైల్వే రాజునే ఎందుకు తన కస్టడీలోకి తీసుకున్నాడు..? నక్సల్స్ కి రైల్వే రాజుకి మధ్య ఏమైనా సంబంధం వుందా..? చివరికి రైల్వే రాజు-ఇంతియాజ్ ఖాన్ మధ్య ఎలాంటి పోరాటం జరిగింది..వీళ్ళలో ఎవరు గెలిచారనేది అసలైన కథ

  విశ్లేషణ: 1990 లో జరిగిన కథగా ఈ సినిమాని తెరకెక్కించినప్పుడే అర్ధం అయ్యింది.ఇప్పడూ వస్తున్నా సినిమాలకంటే భిన్నమైన సినిమా అని అందుకు తగ్గట్లే ఈ సినిమాని తెరకెక్కించారు. అలాంటి వాతావరణాన్ని తెర మీద చూపించటంలో ఈ చిత్ర బృందం సక్సెస్ అయ్యింది.మొదటి భాగంలో ఎక్కువగా శ్రీ విష్ణు క్రికెటర్ గా ఎదుగుతున్న వైనాన్ని బాగానే చూపిస్తూ కథని నడిపించాడు. ఎప్పుడయితే నారా రోహిత్ ఎంటర్ అవుతాడో అప్పటి నుండి కథ వేగం పుంజుకుంటుంది.అలాగే శ్రీ విష్ణు జైలుకి వెళ్ళటం, తిరిగి రావటం, రైల్వే రాజు నక్సలైట్ లీడర్ గా ఎదగటం ఇలా కథ అంత చాలా స్పీడ్ గా నడుస్తుంది.

  అయితే కథ ద్వితీయార్థంలోకి వచ్చేసరికి చాలా నెమ్మదిస్తుంది,కథ,కథనాల్లో ఎక్కువగా చలనం కనిపించదు, సెకండ్ ఆఫ్ లో చాలా వరకు శ్రీ విష్ణు కనిపిస్తుంటాడు,మళ్ళీ నారా రోహిత్ కనిపించే వరకు ఇదే పరిస్థితి, అయితే ఈ సినిమా యొక్క ఫ్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇక్కడ దర్శకుడి యొక్క పనితనం మరియు నారా రోహిత్ అలాగే శ్రీ విష్ణు నటనతో చివరి అరగంట సినిమా అద్భుతంగా ఉంటుంది, దర్శకుడు క్లైమాక్స్ ని ముగించిన తీరు కూడా నచ్చుతుంది.

  ఇందులో నారా రోహిత్ వున్నాడు కాబట్టి ఆయనదే సినిమా అనుకోని వెళ్ళితే కొంచం నిరాశ చెందుతారు, ఈ సినిమాలో ఎక్కువగా శ్రీ విష్ణు కనిపిస్తాడు, అయితే నారా రోహిత్ కనిపించే సమయంలో ఆయన నటన సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఇందులో ఎవరిని పాజిటివ్ గా, నెగిటివ్ గా చూపించకుండా ఎవరి కోణంలో వాళ్ళని కరెక్ట్ గా చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.

  నటి నటులు: ఇందులో నారా రోహిత్ పాత్ర నిడివి కొంచం తక్కువే ఉన్నపటికీ ఈ పాత్ర నారా రోహిత్ అయితేనే న్యాయం చేయగలడు అనేలా నటించాడు, అలాగే చివరి ఎమోషనల్ సన్నివేశంలో నారా రోహిత్ ఆకట్టుకుంటాడు, ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీ విష్ణు గురించి క్రికెటర్ కావాలనే ఒక యువకుడిగా, అలాగే ఒక క్రిమినల్ గా తన పాత్రలో అనేక పార్శ్వాలు చూపించాడు. హీరోయిన్ గా తన్య హోప్ పర్వాలేదు, మిగిలిన బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల,ప్రభాస్ శ్రీను, అజయ్ తమ పాత్రల మేర బాగానే నటించారు. చివరిలో సత్యదేవ్ కూడా ఆకట్టుకుంటాడు.

  సాంకేతిక వర్గం: ఈ సినిమా యొక్క ఛాయాగ్రాహకుడు నవీన్ యాదవ్ గురించి ముందుగా చెప్పుకోవాలి. 1990  నాటి పరిస్థితులని చక్కగా చూపించాడు, అందుకు తగ్గట్లు లైటింగ్, థీమ్స్ ఉపయోగించి అలనాటి వాతావరణాన్ని ప్రతి ఫ్రేమ్ లోని చక్కగా చూపించాడు. అలాగే ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్ బౌన్ గా నిలిచింది. నేపథ్య సంగీతం అందించిన సురేష్ బొబ్బిలి సన్నివేశానికి తగ్గట్లు మ్యూజిక్ అందించాడు, సాయి కార్తీక్ అందించిన పాటలు ఆకట్టుకునేలా వున్నాయి, ఇలాంటి కథని సినిమాగా తీయాలని నిర్ణహించుకొని ఖర్చుకి ఎక్కడ తగ్గకుండా చాలా గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలని మెచ్చుకోవాలి. ‘అయ్యారే’ సినిమా తర్వాత సాగర్ చంద్ర ఇలాంటి సినిమా తీస్తాడని ఎవరు అనుకోని వుండరు, ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్టు ని తీసుకోవటమే కాకుండా ఎంతో బ్యాలెన్స్ గా తెరకెక్కించిన దర్శకుడికి మంచి మార్కులే పడుతాయి. అలాగే రచయితగా తన కలం పదును బాగానే ఉపయోగించి ఒక మంచి ప్రయోగం లాంటి సినిమా తీసి విజయం అందుకున్నాడు.

  చివరి మాట : ఈ మధ్య వస్తున్నా సినిమాలు చూసి మొఖం కొట్టేసిన వాళ్ళందరూ తప్పక చూడవలసిన సినిమా అప్పట్లో ఒకడుండేవాడు

  గవ్వ కామెంట్ : అప్పట్లో ఒకడుండేవాడు..విజయవంతమైన ప్రయోగం

  గవ్వ రేటింగ్ : 3.25/5

  గమనిక: ఇది మా అభిప్రాయం మాత్రమే

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *