• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  బాలయ్య ఫంక్షన్స్ లో చంద్రన్న హుషారు చూశారా

  chandra-babu

  నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి, ఈ సినిమా యొక్క ఆడియో తిరుపతిలో కన్నుల పండగగా జరిగింది. అశేష జనవాహిని మధ్య, అతిరథ మహారధులు నడుమ శాతకర్ణి ఆడియో వేడుక జరిగింది. దీనికి ముఖ్య అతిధులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.

  ఎప్పడు సీరియస్ గా కనిపించే చంద్ర బాబు ఈ కార్యక్రమంలో చాలా హుషారుగా కనిపించటం జరిగింది. వేదిక వద్దకు వచ్చినప్పుడు నుండి వెళ్లే వరకు బాబు చాలా సంతోషంగా కనిపించారు. ఆడియో సీడీ ని ఆవిష్కరించిన చంద్రబాబు వేదిక మీద వున్నవాళ్లందరికి స్వయంగా సీడీ లు అందచేశారు. అలాగే అందరితో ఫొటోలకి పోజులు ఇచ్చారు. ఆడియో సీడీ ఆవిష్కరణ జరిగినప్పుడు అందరు సీడీ లను అందుకొని ఫోటోలు ఇస్తుంటే సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు ఏదో ఆలోచిస్తుంటే, స్వయంగా చంద్రబాబు వెళ్లి మరి ఫోటో వైపు చూడు అని తట్టి మరి చెప్పటం జరిగింది.

  దీనిని బట్టే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు ఈ ఆడియో వేడుకని ఎంత ప్రతిష్టాత్మకమైన వేడుకగా నిర్వహించాడో,,ఆ తరవాత అయన మాట్లాడే పద్ధతికానీ అలాగే చిత్ర యూనిట్ తో ఆయన కలివిడి కానీ చుస్తే ఈయనేనా మన చంద్రబాబు గారు…? ఇంత హుషారుగా వుంటారా అని అనుకోక తప్పదు..ఒక అతిథిలా కాకుండా ఈ కార్యక్రమం తనదే అనేలా చంద్రబాబు నాయుడు అక్కడ కనిపించాడు. ఎంతైనా వియ్యంకుడికి మైలురాయి లాంటి సినిమా కదా..ఈ మాత్రం హుషారు చేయకపోతే ఎలా చెప్పండి..

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *