• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఎన్టీఆర్ పై భారీ స్కెచ్ వేసిన అగ్రహీరో అభిమానులు

  ntr new look

  అభిమానం అనేది హద్దులు దాటకుండా ఉన్నంతవరకు అందరికి బాగానే ఉంటుంది,తమ హీరోనే గొప్ప అనుకోవటం తప్పులేదు, కానీ ఆ మోజులో పడి మిగతా హీరోలా గురించి తప్పుగా ప్రచారం చేయటం అనేది మంచి పద్దతి కాదు, గతంలో ఇలాంటివి చాలా జరిగాయి, కానీ ఈ మధ్య ఇంకొంచము ముందుకి వెళ్లి హీరోలా సినిమా కలెక్షన్స్ కి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అలా ఎందుకు అంటే గతంలో 50 రోజులు , 100 రోజులు అనేవి ఉండేవి వాటి ఆధారంగా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చెప్పుకునే వాళ్ళు,కానీ ఇప్పుడు కేవలం సినిమాకి వచ్చే కలెక్షన్స్ ఆధారంగా చెప్పుకోవాల్సి వస్తుంది, అందుకే కలెక్షన్స్ విషయంలో నెగిటివ్ ప్రచారం ఎక్కువ అయింది.

  తాజాగా జనతాగ్యారేజ్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోయాడు, అయితే కలెక్షన్స్ పరంగా కొన్ని భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి, ఇదే విషయాన్ని ఎన్టీఆర్ తన సన్నిహితుల దగ్గర కూడా ప్రస్తావించినట్టు సమాచారం, కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ ఒక అగ్రహీరోని కూడా దాటిపోతున్నాడు అని గ్రహించిన ఆ హీరో అభిమానులు ఎన్టీఆర్ మీద సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారానికి తెరలేపారు.

  ప్రముఖ టీవీ ఛానెల్ కి చెందిన జర్నలిస్ట్ పేరుతో ట్విటర్ లో ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి జనతా గ్యారేజ్ కలెక్షన్స్ రాయటం మొదలుపెట్టారు, ఆ సినిమాకి అనుకున్న కలెక్షన్స్  కంటే తక్కువే వచ్చాయి,ఏపీ మరియు కర్ణాటకలో జనతాకి వసూళ్లు బాగా తగ్గిపోయాయి, కలెక్షన్స్ పరంగా మూడో స్థానానికి పడిపోయింది అంటూ పోస్ట్ లు పెట్టటం స్టార్ట్ చేశారు, ఈ నెగిటివ్ ప్రచారాన్ని గమనించిన జర్నలిస్ట్ నా పేరు మీద ఎవరో ట్విట్టర్ లో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి పోస్ట్ లు చేస్తున్నారు అంటూ పోలీస్ కంప్లీట్ ఇచ్చారు, దానితో అసలు విషయం బయటపడింది.అయితే దీనిపై ఇంత వరకు ఎలాంటి సమాచారం అధికారికంగా బయటకు రాలేదు

  ఇప్పటికే వరసగా మూడు హిట్ లు కొట్టిన ఎన్టీఆర్ కి మరో హిట్ కనుక వస్తే ఎవరు అందుకొని స్టేజికి వెళ్ళిపోతాడు, అని భావించి ఒక అగ్రహీరో అభిమానులే ఇలా నెగిటివ్ ప్రచారానికి పాల్పడ్డారు అని సినీ పెద్దలు అంటున్నారు,మన హీరోలు అందరూ ఎలాంటి విభేదాలు లేకుండా  కలిసిమెలిసి ఉంటారు, గతంలో కూడా ఒకరి సినిమాకి ఒకరు ఓవర్ వాయిస్ ఇస్తూ, సినిమా విజయం సాధిస్తే అభినందనలు తెలుపుకుంటూ తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి,అది గమనించని కొంతమంది “వీర” అభిమానులే ఈ విధంగా హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు,  ఇప్పటికైనా గమనించి అలాంటి తప్పుడు ప్రచారాన్ని చేయటం ఆపేస్తారని ఆశిద్దాం..

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *