• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  17 రోజుల్లోనే టాప్ ప్లేస్ లోకి దంగల్..!!

  ameer

  బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు పొందిన హీరో ఆమిర్ ఖాన్.తాను ఈ ఏ సినిమా చేసిన చాలా ఆలోచించి పర్ఫెక్ట్ గా నిర్మిస్తాడని అలాగే పర్ఫెక్ట్ గా యాక్టింగ్ చేస్తాడని మనోడికి ఈ పేరు పెట్టారు. అవును ఇది నిజమే అని మరో సారి ప్రూవ్ చేసుకున్నాడా ఆమిర్ ఖాన్.రీసెంట్ గా దంగల్ సినిమాని డిసెంబర్ 23న రిలీజ్ చేశాడన్న విషయం మనకి తెలిసిందే.రిలీజ్ అయిన కేవలం మూడు రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లో చేరిపోయి అందరిని ఆశ్చర్య పరిచింది.

  ఇప్పుడు మరో రికార్డు ని కూడా తన ఖాతా లో వేసుకున్నాడు అమీర్ ఖాన్. ఇప్పటి వరకు  ఇండియా మొత్తం కలెక్షన్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్న “పీ.కే” సినిమాని కేవలం 17 రోజుల్లోనే తన సినిమా రికార్డు ని తానే బ్రేక్ చేసుకున్నాడు. “పీ.కే” ఇండియా వైడ్ టోటల్ కలెక్షన్స్ 339.5 కోట్లు ఉండగా దంగల్ 17 రోజుల్లో 344 కోట్లు కొల్లగొట్టి టాప్ ప్లేస్ కి వెళ్ళిపోయింది.కాగా వరల్డ్ వైడ్ లో మాత్రం ప్రస్తుతం “పీ.కే” దే టాప్ ప్లేస్.వరల్డ్ వైడ్ గా “పీ.కే” 740 కోట్లు తో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా “దంగల్” 17 రోజుల్లో 660.6 కోట్లు కొల్లగొట్టింది. అంటే దంగల్ మరో 80 కోట్లు రాబట్టితే వరల్డ్ వైడ్ గా కూడా తన రికార్డు ని తానే బద్దలు కొట్టుకోనున్నాడు మన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.

   

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *