• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  “ఏ దిల్ హై ముష్కిల్” కి లైన్ క్లియర్..

  ae-dil-hai-mushkil-is-set-release-smoothly-as-per-schedule

  కరణ్ సినిమా “ఏ దిల్ హై ముష్కిల్” విడుదలకు ముందే దేశ వ్యాప్తంగా చూడకూడదంటూ నిరసనలు జరిగాయి. ఈ సినిమాలో పాకిస్తాన్ నటుడు ఉన్నాడని ఈ మూవీ రిలీజ్ చేస్తే థియేటర్ లు పేల్చేస్తామని  వార్నింగ్ లు కూడా వచ్చాయి. ఈ మూవీ ముంబై లో రిలీజ్ చేయక ముందే, ఎంఎన్ఎస్ (మహారాష్ట్ర నవనిర్మాణ్ సంస్థ) మల్టీప్లెక్స్ లపై దాడి కూడా చేసింది. తాజాగా “ఏ దిల్ హై ముష్కిల్” నిర్మాతలకు ఎంఎన్ఎస్ మధ్య ఫైట్ కు ఎండ్ కార్డు పడింది.

  పాకిస్తాన్ నటుల సినిమాను ప్రదర్శించబోమన్న ఎంఎన్ఎస్ వెనక్కు తగ్గింది. మహారాష్ట్ర సీఎంతో ఇరు వర్గాల భేటీ ఫలితాన్నిచ్చింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ను కలిసిన ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే, సినిమా నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చారు. మరోసారి పాకిస్థాన్ నటులను తీసుకోబోమని మూవీ నిర్మాతలు ఫడ్నవిస్ కు స్పష్టం చేశారు దీనిపై ప్రొడ్యూసర్స్ గిల్ట్ ఓ తీర్మానం చేస్తుందని, దానిని సీఎంకు, ఐబి మినిస్ట్రీ కి  కూడా పంపిస్తామని చెప్పారు. సినిమా అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుందని తెలిపారు. ఐతే నిర్మాతల నిర్ణయంపై ఎంఎన్ఎస్ పార్టీ సంతృప్తి వ్యక్తం చేసింది.

  కాగా అంతకుముందు పాకిస్థాన్ నటుల సినిమాను అడ్డుకుంటామని థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయం తీసుకున్నారు. సినిమాను రిలీజ్ చేస్తే సింగల్ థియేటర్ నే కాదు, మల్టీప్లెక్స్ లలో కూడా ఆడించేదిలేదని, తమ మాట వినకుండా మూవీని ప్రదర్శిస్తే థియేటర్స్ ని పేల్చేస్తామని ఎంఎన్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో వాతావరణం హీట్ ఎక్కింది. థియేటర్ ఓనర్ ల నిర్ణయం, ఎంఎన్ఎస్ వార్నింగ్  లతో దిగొచ్చిన కరణ్ జోహార్ క్షమాపణలు చెప్పారు. మరోసారి తన సినిమాలో పాకిస్తాన్ నటులను తీసుకోనని చెప్పాడు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *