• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
  •     
  • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
  •     
  • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
  •     
  • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
  •     
  • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
  •     
  • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
  •     
  • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
  • karamdosa

    సార్క్ సదస్సు జరిగేనా..?..

    3-more-countries-following-india-not-to-attend-saarc-summit

    యూరి ఉగ్రవాది దాడి అనంతరం దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నడుమ నవంబర్ లో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిగే సార్క్ సదస్సు కు హాజరుకారాదని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించారు.

    దక్షణాది దేశాల కూటమికి ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపాల్ కు భారత్ విదేశాంగ శాఖ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. పెరుగుతున్న సీమాంతర ఉగ్రవాద దాడులతో సహా ఇతరుల అంతర్గత వ్యవహారాలను జ్యోక్యం చేసుకుంటున్న ఒక దేశం కారణంగా ఇస్లామాబాద్ లో జరిగే 19వ సార్క్ సదస్సు కు సరైన వాతావరణం లేదని విదేశాంగ శాఖ పరోక్షంగా పాకిస్తాన్ వైపు వేలెత్తి చూపింది.

    భారత్ తరహాలోనే బాంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, భూటాన్ కూడా ఇస్లామాబాద్ లో జరిగే 19వ సార్క్ సదస్సు కు వెళ్లకూడదని నిర్ణయించినట్లు సమాచారం. సార్క్ నిబంధనల ప్రకారం సభ్య దేశాల్లో ఒక దేశాధినేత రాకపోయినా సదస్సు నిర్వహించకూడదు. ఈ నేపధ్యంలో అసలు సదస్సు జరుగుతుందో లేదో అనే సందిగ్దత ఏర్పడింది.

    Add a Comment

    Your email address will not be published. Required fields are marked *