• కొత్త సంవత్సరం మొత్తం దిల్ రాజుకి అంకితమేనా???
 •     
 • ఒకే రోజు రావటం మంచిది కాదన్నారు నాన్న
 •     
 • శతమానం భవతి థియేట్రికల్ ట్రైలర్…
 •     
 • అల్లు శిరీష్ కి అంత రెమ్యూనరేషనా???
 •     
 • మెగా కుటుంబాన్ని తాకిన “దంగల్” ఫీవర్…
 •     
 • సన్నీ పాటకి యూట్యూబ్ వ్యూస్ మోత మోగింది..
 •     
 • గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ షో పడిపోయింది !!!
 • karamdosa

  ఏఓబిలో భారీ ఎన్కౌంటర్.. 21 మంది మావోయిస్టులు మృతి

  21-maoists-were-killed-in-a-major-encounter-at-malkangiri

  ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 21 మంది మావోయిస్ట్స్ లు చనిపోయారు. ఇద్దరు గ్రేహౌండ్స్ పోలీస్ లకు గాయాలయ్యాయి. మల్కన్ గిరి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్లినరీ జరుగుతోందనే సమాచారంతో ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు ఒరిస్సా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు రెండు రోజులనుంచి అక్కడ మాటువేశాయి బలగాలు. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు కాన్స్టేబుల్ లకి గాయాలవడంతో వారిని చికిత్స కోసం హెలికాప్టర్ ల సాయంతో తరలిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఏఓబి లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

  ఆంధ్ర సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు కిరణ్, సుధాకర్, ఉదయ్ చనిపోయారని సమాచారం. ఘటన స్థలం నుంచి 3 ఏకే 47 గన్స్ తో సహా భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ఒరిస్సా పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఎన్కౌంటర్ మృతులను గుర్తించేందుకు మాజీ మావోయిస్టులను ఘటన స్థలానికి తీసుకెళ్లారు పోలీసులు.

  ఈ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఉదయ్ దళం లోని మావోయిస్టులు అందరూ ఈ ఎన్కౌంటర్ లో చనిపోయారని సమాచారం. ఈ ఎన్కౌంటర్ నుంచి రవి అనే మావోయిస్టు నేత తృటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ లో ఆర్కే కుమారుడు మున్నా చనిపోయాడని వార్తలు వస్తున్నాయ్. అయితే అధికారులు దీనిని ధ్రువీకరించలేదు. కొద్దీ రోజుల క్రితమే దళ సభ్యుడిగా చేరారు మున్నా. ఘటన స్థలాల నుంచి మావోయిస్టుల మృతదేహాలు తరలిస్తున్నారు.

  Add a Comment

  Your email address will not be published. Required fields are marked *